logo

  BREAKING NEWS

తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ శుభవార్త!  |   అయోధ్య మసీదుపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!  |   మహారాష్ట్ర – కర్ణాటకకు మధ్య ఏమిటీ ‘బెల్గాం’ వివాదం?  |   తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక ? ఆ ఎమ్మెల్యే రాజీనామా ఖాయం..?  |   మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి చిరంజీవి..? త‌మ్ముడి వెంట అన్న..?  |   బైడెన్ సంచలన నిర్ణయం.. ప్రవాస భారతీయులకు భారీ ఊరట!  |   పీఆర్సీ నివేదిక లీక్: తెలంగాణ సర్కార్ సీరియస్..నిరాశలో ఉద్యోగులు!  |   బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |  

తెలంగాణలో ప్రభుత్వ కొలువుల జాతర.. భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్?

తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించనుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, పోలీసు శాఖలో పోస్టులను భర్తీ చేయనున్నట్టుగా సమాచారం అందుతుంది. వాటితో పాటుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఇతర పోస్టులను కూడా భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.

ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల వివరాలను తెలియజేయవలసిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు సీఎం కేసీఆర్. కాగా రాష్ట్రవ్యాప్తంగా 50 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుసుకుని వేంటనే వాటికి సంబందించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.

ముఖ్యంగా ఉపాధ్యాయ, పోలీసు శాఖలో భారీ ఎత్తున పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఈ తరహా పోస్టుల భర్తీపై కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి కానుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని నిరుద్యోగులు ఎదురుచూడగా ప్రభుత్వం నుంచి ఈ విషయంపై ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

Related News