logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

పెళ్లి పీటలేక్కబోతున్న సూపర్ హిట్ సీరియల్ జోడీ..?

బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని జోడీ నవ్య స్వామి- రవికృష్ణ. వరూధిని పరిణయం సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి కృష్ణ ఆ తర్వాత అనేక సీరియళ్లలో నటించాడు. ఇటీవల బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఈ షో తర్వాత రవి కృష్ణ, నవ్య స్వామిలు కలిసి నటిస్తున్న సీరియల్ ‘ఆమె కథ’. ఈ సీరియల్ లో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటె వీరిద్దరి పెళ్లి వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా ఈ జంట ప్రేమలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు తోడు ఓ టీవీ ఛానెల్ కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి పాల్గొన్నారు. అంతేకాదు ఆ టీవీ యాజమాన్యం ఇద్దరికీ పెళ్లి కూడా చేసేసింది. ఇద్దరూ ముద్దులు పెట్టుకోవడం, ఒకరితో ఒకరు రొమాన్స్ చేయడం ఇలా ప్రతీది తామిద్దరం ప్రేమలో ఉన్నామన్నట్టుగానే చిత్రీకరించారు.

అదంతా ప్రోగ్రామ్ లో భాగమే అయినా ఆనాటి నుంచి వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల సుమ కనకాల క్యాష్ షోలో వీరిద్దరూ చనువుగా ఉండటంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. దీంతో నవ్య స్వామీ తమ పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రవి కృష్ణతో తాను ప్రేమలో లేనని, పెళ్లి కూడా చేసుకోవడం లేదని తెలిపింది. అయితే ఇలాంటి రూమర్లను తానెప్పుడూ పట్టించుకోనని కానీ ఈ వార్తల వల్ల మొదటి సారి తన కుటుంబం బాధపడిందని తెలిపింది.

ముఖ్యంగా మా అమ్మ చాలా ఇబ్బంది పడింది. నీకు పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఇదంతా ఏంటి? ఏం జరుగుతుంది మీ మధ్య? అని అడిగేసరికి తానేమీ చెప్పలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియదు. ఆ రోజు షోలో డైరెక్టర్ చెప్పినందువల్లనే క్లోజ్ గా ఉండాల్సి వచ్చింది. ఏదో ఎంటర్ టైన్మెంట్ కోసం చేస్తే వాటినే సీరియస్ గా తీసుకుంటున్నారు. వీటిని ఆపడం మన వల్ల కాదు. కానీ రవికృష్ణతో నాకు మంచి ర్యాపో ఉంది. అది నటన విషయంలో మాకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పుకొచ్చింది.

Related News