బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ మనమరాలు శ్వెత బచ్చన్ కుమార్తె నవ్య నవేలి నందా ప్రేమ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వకున్నా బచ్చన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కావడంతో ఈమె గురించిన వార్తలు తరచుగా చక్కర్లు కొడుతుంటాయి. గతంలో నవ్యా షారుక్ ఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ తో ప్రేమలో ఉందని పుకార్లు వచ్చాయి.
అయితే వారిద్దరూ చిన్ననాటి స్నేహితులన్న విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్లుగా ఇప్పుడు మరో వార్త వినిపిస్తోంది. అమితాబ్ మనవరాలు జావేద్ జాఫ్రీ తనయుడు మీజాన్ జాఫ్రీ తో ప్రేమలో ఉందని రూమర్లు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై జావేద్ జాఫ్రి స్పందించారు. వారిద్దరూ స్నేహితులు మాత్రమే.
ఇద్దరి మధ్యా ప్రేమాగీమా లేదు. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకే స్కూల్ లో చదువుకున్నారు. వారిద్దరి రిలేషన్ పై వారికి కూడా ఓ క్లారిటీ ఉందన్నారు. అయితే ఈ విషయంపై ఈ కుర్ర జంట మాత్రం స్పందించడం లేదు. దీంతో నెటిజన్లకు మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి.