logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

నిరుద్యోగుల‌కు మోడీ ఇస్తున్న‌ వ‌రం ఎన్ఆర్ఏ.. పూర్తి వివ‌రాలు

న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం మ‌రో విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌కు శ్రీకారం చుట్టింది. 75 ఏళ్లుగా కొన‌సాగుతున్న ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క్రియ‌ను స‌మూలంగా మార్చుతూ కేంద్ర మంత్రివ‌ర్గం నిర్ణ‌యించింది. ఒకే దేశం – ఒకే ప‌రీక్ష అనే విధానం అమ‌లు చేసేందుకు గానూ నేష‌న‌ల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ)ని కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించ‌బోతోంది. ఇది నిరుద్యోగుల‌కు చాలా మేలు చేయ‌బోతోంది.

ఎన్ఆర్ఏ అంటే ఏంటి ?
ఎన్ఆర్ఏ అంటే నేష‌న‌ల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ. తెలుగు జాతీయ నియామ‌క సంస్థ‌గా పిలుస్తున్నాం. ఆగ‌స్టు 19, 2020 నాడు కేంద్ర మంత్రివ‌ర్గం ఈ సంస్థ‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇక నుంచి కేంద్ర ప్ర‌భుత్వానికి సంబంధించిన ఉద్యోగ నియామ‌కాలు మొత్తం ఈ సంస్థ‌నే చేప‌డుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆర్ఆర్బీ, ఎస్ఎస్‌సీ, ఐబీపీఎస్ ఎన్ఆర్ఏ ప‌రిధిలోకి వ‌స్తాయి. త‌ర్వాత క్ర‌మంగా కేంద్రం ప‌రిధిలో ఉన్న సుమారు 20 ఉద్యోగ నియామ‌క సంస్థ‌లు ఎన్ఆర్ఏలో విలీనం కాబోతున్నాయి.

ఎన్ఆర్ఏ ఏయే నియామ‌కాలు చేప‌డుతుంది ?
ఇప్ప‌టివ‌ర‌కు వివిధ శాఖ‌ల‌కు చెందిన ఉద్యోగాల‌ను ఆయా శాఖ‌ల‌కు చెందిన నియామ‌క సంస్థ‌లు భ‌ర్తీ చేసేవి. ఉదాహ‌ర‌ణ‌కు రైల్వే ఉద్యోగాల‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఇచ్చేది. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన నియామ‌కాల‌ను ఐబీపీఎస్ చేసేది. కేంద్రంలోని చాలా శాఖ‌ల‌కు సంబంధించిన నియామ‌కాలు చేప‌ట్టేందుకు ఎస్ఎస్‌సీ ఉండేది. ఇప్పుడు ఇలా ప్ర‌త్యేక నియామ‌క బోర్డులు ఏమీ ఉండ‌వు. అన్ని కేంద్ర ప్ర‌భుత్వ‌, కేంద్ర ప్ర‌భుత్వ అనుబంధ రంగాల‌కు సంబంధించిన ఉద్యోగ నియామ‌కాల‌ను నూత‌నంగా తీసుకువ‌స్తున్న ఎన్ఆర్ఏనే నియ‌మిస్తుంది.

ఎన్ఆర్ఏ ప‌రీక్ష విధానం ఎలా ఉంటుంది ?
నేష‌న‌ల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఆరు నెల‌ల‌కు ఒక‌సారి ప‌రీక్ష నిర్వ‌హిస్తుంది. ఉద్యోగం ఏదైనా ప‌రీక్ష మాత్రం ఒక్క‌టే ఉంటుంది. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ప్ర‌య‌త్నించే ఉద్యోగార్థులు ఈ ఒక్క ప‌రీక్ష రాస్తే స‌రిపోతుంది. వారి స‌మ‌గ్ర నైపుణ్యాల‌ను, విష‌య ప‌రిజ్ఞానాన్ని గుర్తించేలా ఈ ప‌రీక్ష ఉంటుంది. ఉద్యోగార్థుల‌కు వ‌చ్చే మార్కులు మూడేళ్ల వ‌ర‌కు చెల్లుబాటు అవుతాయి. ఈ మూడేళ్ల కాలంలో కేంద్ర ప్ర‌భుత్వ‌, దాని అనుబంధ సంస్థ‌ల‌కు ఉద్యోగ నియామ‌క ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్పుడు ఉద్యోగార్థులు అప్లై చేసుకోవాలి. ఎన్ఆర్ఏ మార్కుల బ‌ట్టే ఉద్యోగ నియామ‌కం జ‌రుగుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు బ్యాంకింగ్ రంగంలో ఐబీపీఎస్ ఈ విధానాన్నే అమ‌లు చేస్తోంది.

ఎన్ఆర్ఏ ప‌రీక్ష ఎన్ని స్థాయిల్లో, ఎన్ని ద‌శ‌ల్లో ఉంటుంది ?
ఎన్ఆర్ఏ ప‌రీక్ష మూడు స్థాయిల్లో ఉంటుంది. ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్‌, డిగ్రీ అర్హ‌త‌ల‌తో మూడు స్థాయిల్లో ప‌రీక్ష జ‌రుగుతుంది. అభ్య‌ర్థులు వారి విద్యార్హ‌త‌ను బ‌ట్టి ఆయా స్థాయిల ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంటుంది. కొన్ని నియామ‌కాలకు ఒకే ద‌శ ప‌రీక్ష ఉంటుంది. ఇందులో వ‌చ్చే స్కోర్‌ను బ‌ట్టే ఉద్యోగాల‌కు ఎంపిక చేస్తారు. కొన్ని ఉద్యోగాల‌కు మాత్రం రెండు ద‌శ‌ల్లో ప‌రీక్ష‌లు ఉంటాయి. తొలి ద‌శ‌లో సాధించిన మార్కుల‌ను బ‌ట్టి మొద‌టి 5 శాతం మందికి రెండో ద‌శ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

ఎన్ఆర్ఏ ప‌రీక్ష ఎక్క‌డ జ‌రుగుతుంది ?
ఎన్ఆర్ఏ ఏర్పాటును కేంద్ర ప్ర‌భుత్వం చాలా ప‌క‌డ్భందీగా ఏర్పాటు చేస్తోంది. నిరుద్యోగుల‌కు అందుబాటులో ఉండేలా దేశంలోని అన్ని జిల్లాల్లో ఎన్ఆర్ఏ ప‌రీక్ష కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌బోతోంది. దేశంలో సుమారు వెయ్యి ప‌రీక్ష కేంద్రాలు ఉండ‌నున్నాయి. ఏ జిల్లా వారు ఆ జిల్లాలోనే ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అవ‌కాశాన్ని కేంద్రం ఎన్ఆర్ఏ ద్వారా క‌ల్పించ‌బోతోంది.

ఎన్ఆర్ఏ ద్వారా నిరుద్యోగ‌ల‌కు క‌లిగే మేలు ఏంటి ?
ఎక్కువ‌గా నిరుద్యోగుల‌కు మేలు చేయ‌డానికే కేంద్రం ఎన్ఆర్ఏను తీసుకువ‌స్తోంది.
1. ఎన్ఆర్ఏ ద్వారా విద్యార్థులకు ప‌రీక్ష ఫీజుల బాధ త‌ప్పుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఎన్ని ఉద్యోగాల‌కు అప్లై చేస్తే అన్ని సార్లు ప‌రీక్ష ఫీజు క‌ట్టాల్సి ఉండేది. ఇప్పుడు అన్ని ఉద్యోగాల‌కు ఒకే ప‌రీక్ష కాబ‌ట్టి ఒకేసారి ప‌రీక్ష ఫీజు క‌డితే స‌రిపోతుంది.
2. స్వంత జిల్లాలో ప‌రీక్ష జ‌రుగుతుంది కాబ‌ట్టి ప‌రీక్షా కేంద్రాల‌కు ఎక్క‌డెక్క‌డికో వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.
3. ఆన్‌లైన్‌లోనే ప‌రీక్ష జ‌రుగుతుంది.
4. 12 భార‌తీయ భాష‌ల్లోనూ ప‌రీక్ష జ‌రుగుతుంది కాబ‌ట్టి మాతృ భాష‌లోనే ప‌రీక్ష రాసుకునే వీలు ఉంటుంది.
5.ఆరు నెల‌ల‌కు ఒక‌సారి ప‌రీక్ష జ‌రుగుతుంది కాబ‌ట్టి అభ్య‌ర్థులు మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌రీక్ష రాసి స్కోర్ పెంచుకునే అవ‌కాశం ఉంటుంది. మెరుగైన స్కోర్‌నే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు.
6. ఇప్ప‌టివ‌ర‌కు ప‌రీక్ష‌లు రాసిన త‌ర్వాత నెల‌ల త‌ర‌బ‌డి ఫ‌లితాల కోసం ఎదురు చూడాల్సి వ‌చ్చేది. ఇప్పుడు ఎన్ఆర్ఏ ద్వారా ఫ‌లితాలు వెంట‌నే వ‌స్తాయి.
7. ప్ర‌త్యేకంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు నియామ‌కాల ప్ర‌క్రియ‌కు ఎక్కువ స‌మ‌యం ప‌ట్టేది. ఇప్పుడు ప్ర‌త్యేకంగా ప‌రీక్ష నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం లేదు కాబ‌ట్టి నియామ‌క ప్ర‌క్రియ స‌మ‌యం గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంది.
8. సిల‌బ‌స్ కూడా ఇంచుమించు ఒక‌టే ఉంటుంది కాబ‌ట్టి విద్యార్థులు ప్రిపేర్ అవ‌డం కూడా సులువ‌వుతుంది. క్వ‌శ్య‌న్ బ్యాంక్ కూడా ఒక‌టే ఉంటుంది.
9. అన్నింటికీ మించి ఉద్యోగ నియామ‌కాల్లో పార‌ద‌ర్శ‌క‌త పెరుగుతుంది.

Related News