logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

అన్ని ప్రభుత్వ నియామకాలకు ఒకే పరీక్ష.. అప్ డేట్ వచ్చేసింది!

అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఒకే కామన్ ఎలిజిబులిటీ టెస్ట్ (సీఈటీ) కు సంబందించిన అప్ డేట్ వచ్చేసింది. ఇందుకు సంబందించిన మంత్రి వర్గం ఆమోదంతో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) ని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ మేరకు కామన్ ఎలిజబిలిటీ టెస్ట్ ను ఈ ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించనున్నట్టుగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు.

ఎస్ఎస్సీ, ఐబీపీఎస్, ఆర్ఆర్బి తదితర ఉద్యోగ నియామకాలకు కామన్ ఎంట్రస్ట్ టెస్ట్ ను నిర్వహించనున్నారు. ఈ సెట్ లో సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులు ఇతర ఉద్యోగాల నియామక పరీక్షలకు కూడా హాజరుకావచ్చు.

ఎన్ఆర్ఏ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన స్వతంత్య్ర సంస్థ అని కేంద్రం స్పష్టం చేసింది. గ్రూప్ బి, సి (నాన్-టెక్నికల్) పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిచండం, ఎంపికైన అభ్యర్థుల వివరాలను షార్ట్‌లిస్ట్ చేయడం ఈ సంస్థ విధులు. ఎన్ఆర్ఏ ఏర్పాటులో భాగంగా ప్రతి జిల్లాలో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఇక ఈ సెట్ పరీక్ష గురించిన ముఖ్యమైన విషయాలను పరిశీలిస్తే.. గ్రాడ్యుయేట్, ఇంటర్ అభ్యర్థులకు వేరు వేరుగా ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఒక్క సారి ఈ సెట్ రాస్తే మూడేళ్ళ వరకు వాలిడిటీ ఉంటుంది. అభ్యర్థులు ఏజ్ లిమిట్ ఆధారంగా ఎన్ని సార్లైనా ఈ పరీక్షను రాసుకోవచ్చు.

సుదూర ప్రాంతాల్లో ఉండే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని జిల్లాకో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత విధానంలో మహిళలు, దివ్యాంగ అభ్యర్థులు పరీక్షలు రాయడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా వారు చాలా ఇబ్బంది పడేవారు. కానీ, ఇప్పుడు తీసుకువచ్చిన విధానంతో మహిళలు, దివ్యాంగులు, ఆర్థిక స్థోమత లేని అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు చేరువ అవుతాయని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.

 

Related News