logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల పంట: మాట నిలబెట్టుకున్న మహేష్.. దుమ్మురేపిన నాని సినిమా!

తాజాగా ప్రకటించిన 67 వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. తెలుగు పరిశ్రమ నుంచి రెండు సినిమాలకు గాను మొత్తం ఐదు జాతీయ అవార్డులు వరించాయి. అందులో ఒకటి మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా కాగా. మరొకటి నాని ‘జెర్సీ’ ఉన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమా ఎవరూ ఊహించని విధంగా ఏకంగా మూడు జాతీయ అవార్డులను దక్కించుకోవడంతో మహేష్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వ్యవసాయం, రైతుల నేపథ్యంలో వచ్చిన మహర్షి సినిమా తనకెంతో ప్రత్యేకమైనదని మహేష్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేయదని తెలిపాడు. మహేష్ చెప్పినట్టుగానే ఏకంగా వంద కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టిన మహర్షి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల పంట పండించింది. ఇప్పుడు ఏకంగా మూడు అవార్డులను సొంతం చేసుకుని సత్తా చాటింది. ఉత్తమ వినోదాత్మక చిత్రం తెలుగు క్యాటగిరీకి మహర్షి ఎంపికైంది. అలాగే ఈ సినిమాకు గాను ఉత్తమ ప్రొడక్షన్ హౌస్ గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్స్ కు నేషనల్ అవార్డు దక్కింది. మహర్షి సినిమాకు పని చేసిన రాజు సుందరం మాస్టర్ బెస్ట్ డ్యాన్స్ మాస్టర్ గా అవార్డు దక్కింది.

ఇక ఉత్తమ తెలుగు సినిమాగా న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ నేషనల్ అవార్డుకు ఎంపికైంది. ఈ సినిమాకు పని చేసిన ఎడిటర్ నవీన్ నూలికి బెస్ట్ ఎడిటర్ క్యాటగిరిలో అవార్డు అందుకున్నారు.’మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వచ్చిన జెర్సీ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో నాని నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఉత్తమ చిత్రంగా జెర్సీ ఎంపికైనందుకు డైరెక్టర్ గౌతమ్ సంతోషం వ్యక్తం చేసాడు. అయితే నానికి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తే ఇంకా సంతోషించేవాడినని చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

Related News