logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌

క‌రోనా వైర‌స్‌పై పోరాటంలో వ్యాక్సిన్ బ్ర‌హ్మాస్త్రం వంటిది. అందుకే గ‌తంలో ఏ వైర‌స్‌కు లేని విధంగా క‌రోనా వైర‌స్‌కు వేగంగా వ్యాక్సిన్‌ల‌ను అభివృద్ధి చేశారు శాస్త్ర‌వేత్త‌లు. ఇలా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ల‌లో ఒక‌టి నాస‌ల్ స్ప్రే. ఇది ముక్కు ద్వారా ఇచ్చే క‌రోనా వ్యాక్సిన్ అని చెప్ప‌వ‌చ్చు.

అమెరికాలోని జార్జియా యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు అనేక రోజులు పాటు ప‌రిశోధ‌న‌లు జ‌రిపి క‌రోనాకు విరుగుడుగా నాస‌ల్ స్ప్రేను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్‌ను జంతువుల‌పై ముందుగా ప్ర‌యోగించారు. జంతువుల‌పై ప్ర‌యోగాల్లో ఇది బాగా ప‌ని చేస్తున్న‌ట్లు తెలింది. దీంతో త్వ‌ర‌లోనే మ‌నుషుల‌పై కూడా క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ప్రారంభించ‌నున్నారు. ఇది క‌నుక స‌క్సెస్ అయితే క‌రోనా వ్యాకినేష‌న్ ప్ర‌క్రియ‌లో కీల‌క మ‌లుపుగా చెప్ప‌వ‌చ్చు.

నాస‌ల్ స్ప్రే వ్యాక్సిన్ ద్వారా సులువుగా, వేగంగా ఎక్కువ మంది ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ అందించ‌వ‌చ్చు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని వేగంగా అదుపు చేయ‌వ‌చ్చ‌ని ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. పారాఇన్‌ఫ్లూయెంజా వైర‌స్ 5 అనే సాధార‌ణ జ‌లుబు వైర‌స్‌లో క‌రోనా వైర‌స్ స్పైక్ ప్రోటీన్‌ను ప్ర‌వేశ‌పెట్టి ఈ నాస‌ల్ స్ప్రే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో క‌రోనా యాంటీబాడీలు బాగా ఉత్ప‌త్తి అవుతాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచనా వేస్తున్నారు.

కాగా, కెన‌డాలోని వాంకోవ‌ర్‌కు చెందిన సెనోటైజ్ అనే బ‌యోటెక్ కంపెనీ కూడా ఇటువంటి ఒక‌ నాస‌ల్ స్ప్రే వ్యాక్సిన్‌ను రూపొందించింది. దీనికి సంబంధించిన క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కెన‌డా, బ్రిట‌న్ దేశాల్లో జ‌రిగాయి. క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన 79 మందిపై ట్ర‌య‌ల్స్ జ‌ర‌ప‌గా 24 గంట‌ల్లో 95 శాతం వైర‌ల్ లోడ్ త‌గ్గింద‌ని, 72 గంట‌ల్లో 99 శాతం వైర‌ల్ లోడ్ త‌గ్గిపోయిన‌ట్లు గుర్తించారు. బ్రిటెన్ క‌రోనా మ్యుటెంట్‌పైన కూడా ఈ స్ప్రే స‌మ‌ర్థంగా ప‌ని చేసింది.

క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన వారు స్వయంగా ఈ స్ప్రేను ముక్కులో స్ప్రే చేసుకోవ‌చ్చు. ఈ స్ప్రే ద్వారా ముక్కులోనే 72 గంట‌ల్లో క‌రోనా వైర‌స్ అంత‌మ‌వుతుంది. మొద‌టి ద‌శ ప్ర‌యోగాలు విజ‌య‌వంతం కావ‌డంతో ఇటీవ‌లే కెన‌డాలో క‌రోనా పాజిటీవ్ రోగుల‌పైన రెండో ద‌శ ప్ర‌యోగాలు కూడా చేశారు. ఈ ప్ర‌యోగాలు కూడా స‌క్సెస్ అయ్యాయి. ఎవ‌రికీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవ‌ని తేలింది.

మ‌న దేశంలో కూడా భార‌త్ బ‌యోటెక్ సంస్థ ఇటువంటిదే ఒక ప్ర‌యోగం చేస్తోంది. కోరోఫ్లూ పేరుతో ముక్కు వ్యాక్సిన్‌ను త‌యారుచేసింది. జ‌న‌వ‌రిలోనే దీని ట్ర‌య‌ల్స్ కూడా ప్రారంభ‌మ‌య్యాయి. వాషింగ్ట‌న్ యూనివ‌ర్సిటీతో క‌లిసి భార‌త్ బ‌యోటెక్ సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఇప్ప‌టికే దేశంలోని నాలుగు న‌గ‌రాల్లో ట్ర‌య‌ల్స్ జ‌రిగాయి. మ‌రి, ముక్కు ద్వారా వేసే క‌రోనా వ్యాక్సిన్‌లు ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తాయో చూడాలి.

Related News