అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కరోనా బారిన పడ్డారు. ట్రంప్ వద్ద సలహాదారుగా పని చేసే హోప్ హిక్స్‌కు కరోనా పాజిటీవ్ నిర్ధారణ కావడంతో ట్రంప్, మెలానియా కూడా పరీక్షలు జరిపించుకున్నారు. వీరిద్దరికీ కరోనా పాజిటీవ్‌గా తేలింది. ఈ విషయాన్ని ట్రంప్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ కాగానే క్వారంటైన్లోకి వెళ్లిపోయామని, చికిత్స తీసుకుంటున్నామని ట్రంప్ తెలిపారు.
కాగా, కరోనా వైరస్ బారిన పడిన తన స్నేహితుడు డోనాల్డ్ ట్రంప్, మెలానియా త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఉండాలని మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ట్వీట్ చేశారు.