logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌

క‌రోనా వైర‌స్ నుంచి ఇప్పుడిప్పుడే దేశం కోలుకుంటోంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న జాతినుద్దేశించి ప్ర‌సంగించారు. దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుతున్నాయ‌ని, రిక‌వ‌రీ రేటు బాగుంద‌ని అన్నారు. భార‌త్‌లో క‌రోనా మ‌ర‌ణాల రేటు కూడా త‌క్కువ‌గా ఉంద‌ని, అమెరికా, బ్రెజిల్‌తో పోలిస్తే మన ద‌గ్గ‌ర ప‌రిస్థితి మెరుగ్గా ఉంద‌న్నారు.

ఇప్పుడిప్పుడే భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ కోలుకుంటోంద‌ని ప్ర‌ధాని చెప్పారు. ఇంకా మ‌నం క‌రోనాతో పోరాడుతున్నామ‌నే విష‌యాన్ని గుర్తించుకోవాల‌ని ఆయ‌న కోరారు. క‌రోనాతో ఇక ప్ర‌మాదం లేద‌ని అనుకోవ‌ద్ద‌ని, అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన స‌మయం ఇద‌ని ఆయ‌న పేర్కొన్నారు. వ‌రుస‌గా పండుగ‌లు వ‌స్తుంన్నందున పండుగ‌ల స‌మ‌యాల్లో నిర్ల‌క్ష్యం వ‌హించ‌వ‌ద్ద‌ని ఆయ‌న దేశ ప్ర‌జ‌ల‌ను కోరారు.

తాను దేశ ప్ర‌జ‌లంద‌రినీ సుర‌క్షితంగా చూడాల‌నుకుంటున్న‌ట్లు మోడీ ఆకాంక్షించారు. క‌రోనా కేసులు త‌గ్గుతున్నాయ‌ని ఎవ‌రూ నిర్ల‌క్ష్యంగా ఉండొద్ద‌ని, భౌతిక దూరం త‌ప్ప‌క పాటించాల‌ని, మాస్కులు ధ‌రించాల‌ని ఆయ‌న కోరారు. క‌రోనా వ్యాక్సిన్ అభివృద్ధికి ప‌రిశోధ‌న‌లు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని, త్వ‌ర‌లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. ప్ర‌తీ ఒక్క‌రికీ క‌రోనా వ్యాక్సిన్ అందిస్తామ‌ని మోడీ పేర్కొన్నారు. వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరారు.

Related News