logo

  BREAKING NEWS

క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |   క‌రోనా వ్యాక్సిన్ కావాలంటే బీజేపీకే ఓటేయాలా ?  |   గుడ్ న్యూస్: వ్యాక్సిన్ రిలీజ్ డేట్ చెప్పేసిన భార‌త్ బ‌యోటెక్‌  |   మీ పిల్ల‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ స్థాయి హాస్ట‌ల్‌తో కూడిన‌ విద్య కావాలా  |   RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |  

నాలుగు ఉంగ‌రాలు.. రూ.31 వేల న‌గ‌దు.. ప్ర‌ధాని ఆస్తుల విలువ తెలుసా ?

దేశ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ ఆస్తుల విలువ ఆశ్చ‌ర్యం క‌లిగించేలా ఉంది. ప‌ద‌మూడేళ్లు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా, ఏడేళ్లు దేశ ప్ర‌ధాన‌మంత్రిగా ప‌ని చేసిన మోడీ ఆస్తుల చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. ఆయ‌న‌కు స్వంత వాహ‌నం కూడా లేదు. ఈ ఏడాది జూన్ 30 నాటికి త‌న ఆస్తుల వివ‌రాల‌ను మోడీ ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యానికి అందించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆస్తుల విలువ కేవ‌లం రూ.2.85 కోట్లు మాత్ర‌మే. ఇందులో చ‌రాస్తుల విలువ రూ.1.75 కోట్లు.

ప్ర‌స్తుతం మోడీ చేతిలో కేవ‌లం రూ.31,450 న‌గ‌దు మాత్ర‌మే ఉందని ఆయ‌న తెలిపారు. గుజ‌రాత్ గాంధీన‌గ‌ర్ ఎన్ఎస్సీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో న‌రేంద్ర మోడీకి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది. ఇందులో రూ.3,38,173 విలువైన‌ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇదే శాఖ‌లో ఫిక్డ్స్ డిపాజిట్స్ రూపంలో రూ.1.60 కోట్లు ఉన్నాయి. రూ.8,43,124 విలువైన నేష‌న‌ల్ సేవింగ్స్ స్కీమ్ బాండ్లు ఉన్నాయి.

రూ.1.50 లక్ష‌ల విలువైన ఎల్ఐసీ పాల‌సీలు కూడా మోడీకి ఉన్నాయి. రూ.20 వేల విలువైన ఇన్‌ఫ్రా బాండ్లు ఉన్నాయి. ఇవే కాకుండా 45 గ్రాములతో నాలుగు బంగారు ఉంగ‌రాలు మోడీకి ఉన్నాయి. ఆయ‌న‌కు స్వంత వాహ‌నం కూడా లేదు. గాంధీన‌గ‌ర్ 3,531 గ‌జాల స్థ‌లంలో మోడీకి 25 శాతం వాటా ఉంది. మార్కెట్‌లో ఈ ఆస్తి విలువ రూ.1.10 కోటి ఉంటుంద‌ని ఆయ‌న తెలియ‌జేశారు. మొత్తంగా గ‌త ఏడాదికి ఇప్ప‌టికి మోడీ ఆస్తి రూ.36 ల‌క్ష‌లు పెరిగింది.

ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాని మోడీకి ఎటువంటి ఆదాయ‌మూ లేదు. కేవ‌లం ప్ర‌ధానమంత్రిగా ఆయ‌న‌కు ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చే రూ.2 ల‌క్ష‌ల జీత‌మే మోడీకి ఆదాయ‌వ‌న‌రు. ఈ డ‌బ్బులలో ఆయ‌న ఖ‌ర్చులు పోను మిగిలిన డ‌బ్బుల‌ను ఫిక్డ్స్ డిపాజిట్ల రూపంలో దాచుకుంటున్నారు. వీటిపైన వ‌స్తున్న వ‌డ్డీని కూడా ఆయ‌న ఫిక్డ్స్ డిపాజిట్లుగా మారుస్తున్నారు. అందుకే మోడీ ఆస్తి గ‌త ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగింది.

అప్పుల విష‌యానికి వ‌స్తే మోడీకి ఒక్క రూపాయి కూడా అప్పు లేదు. ఆయ‌న బ్యాంకుల వ‌ద్ద నుంచి ఎటుంటి రుణం తీసుకోలేదు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం, ముఖ్య‌మంత్రిగా, ప్ర‌ధాన‌మంత్రిగా 20 ఏళ్లుగా కొన‌సాగుతున్న మోడీ అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ప‌ని చేస్తున్నార‌న‌డానికి ఆయ‌న ఆస్తుల విలువ ఉదాహ‌ర‌ణ‌గా క‌నిపిస్తోంది. నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌తీయేటా ఆయ‌న త‌న ఆస్తుల వివ‌రాల‌ను స‌మ‌ర్పిస్తున్నారు.

Related News