logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

‘సింహాద్రి అప్పన్న సాక్షిగా..’ సీఎం జగన్ కు నారా లోకేష్ సవాల్!

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. తనపై వైసీపీ వారు చేస్తున్న ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. సింహాద్రి అప్పన్న సాక్షిగా నాపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమని నిరూపించడానికి నేను సిద్ధం.. అప్పన్న సన్నిధికి రావడానికి నువ్వు సిద్దమేనా అంటూ సవాల్ చేసారు.

జగన్ ప్రభుత్వమిచ్చే హామీలన్నీ ఫేక్ అని చివరకు తనపై దొంగ నేతలతో కలిసి చేయిస్తున్న ఆరోపణలన్నీ ఫేక్ అన్నారు. అంతకు ముందు జర్నలిస్టుల అక్రిడేషన్ పై ట్వీట్ చేసిన నారా లోకేష్ అక్రిడేషనో జర్నలిస్టులు గాని, జర్నలిస్టు సంఘం నేతలకు గాని లేకపోవడం వింతల్లోకెల్లా వింత అంటూ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం తాను చేసిందే చట్టంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.

రామతీర్థం ఘటన నారా లోకేష్, చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని.. ఘటన జరగడానికి ముందు రోజు టీడీపీ సభ్యులు కొండపైకి వచ్చారని వారే విగ్రహాలు ధ్వంసం చేసారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేసారు.

Related News