logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

నాని ఫ్యాన్స్ కు సర్ప్రైజ్.. ‘శ్యామ్ సింగరాయ’లో మరో హీరో

హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇప్పటికే ‘టక్ జగదీశ్’ సినిమాను కంప్లీట్ చేసిన నాని ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ’ సినిమా పై దృష్టి పెట్టాడు. ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాని లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. తన గత సినిమాలకన్నా భిన్నంగా ఈ సినిమా ఉండబుతుందని సినిమా టీమ్ చెప్పకనే చెప్పేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో నానితో పాటుగా మరో యంగ్ హీరో కూడా కనిపించనున్నాడట. అతనెవరో కాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. శ్యామ్ సింగరాయ దర్శకుడికి డైరెక్టర్ గా మొదటి అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేసాడు విజయ్.

దీంతో ఇప్పుడు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తన రెండో సినిమాలో ఓ కీలక పాత్రలో విజయ్ ను చూపించనున్నాడట. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. నానితో దాదాపు ఏడేళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు విజయ్. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ మొదటి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో నాని – విజయ్ లు కలిసి నటించిన విషయం తెలిసిందే.

ఆ సినిమాతోనే విజయ్ హీరోగా మారి ‘పెళ్లి చూపులు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు. ఆనాటి నుంచీ ఈ ఇద్దరు హీరోల మధ్య మంచి స్నేహం ఉంది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి తెరపై కనిపిస్తే ఇక అభిమానులకు పండగే. అయితే వార్తపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.

Related News