logo

‘అంటే సుందరానికి’.. కొత్త సినిమా ప్రకటించిన నాని: క్రేజీ వీడియో

న్యాచురల్ స్టార్ నాని హీరోగా మైత్రి మూవీ బ్యానర్ లో 28వ సినిమాను అనౌన్స్ క్స చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ ను విడుదల చేసారు. ”అంటే సుందరానికి” అనే టైటిల్ ను ఖరారు చేస్తూ అందుకు సంబందించిన ఓ వీడియోను విడుదల చేసారు సినిమా టీమ్. ఈ వీడియోలో కేవలం సంభాషణలు మాత్రమే పలికిస్తూ దర్శకుడు వినూత్నంగా తీర్చిదిద్దిన తీరుకు ప్రశంసలు లభిస్తున్నాయి.

యంగ్ టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమాతోనే మొదటిసారి మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా ఫహద్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఒకరు న్యాచురల్ స్టార్ అయితే మరొకరు ఎక్స్ ప్రెషన్ క్వీన్. ఈ ఇద్దరి జంటను తెరపై చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు ఉత్సాహం చూపుతున్నారు.

కాగా తాజాగా విడుదల చేసిన టైటిల్ డిజైన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇందులో నాని విభిన్నమైన లుక్ తో కనపించనున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ‘బ్రోచేవారెవరురా’ అనే సినిమాతో హిట్టు కొట్టిన వివేక్ ఆత్రేయా ఈసారి మరో ప్రయోగం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

Related News