logo

  BREAKING NEWS

చింత‌గింజ‌ల‌తో మోకాళ్ల నొప్పుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం‌  |   పాత రూ. 100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవా.. నిజమెంత?  |   మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని షాక్.. బీజేపీ ప్లాన్ లో భాగమేనా?  |   వీడని ఉత్కంఠ.. పంచాయతీ ఎన్నికలపై మరో ట్విస్ట్..!  |   బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |   నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల కౌంటర్: వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!  |   అమెరికా అధ్యక్షుడి ప్రసంగాల వెనుక మన తెలుగోడి ప్రతిభ  |   ‘పంచాయతీ’ నోటిఫికేషన్ ఎఫెక్ట్: షాకిస్తున్న అధికారులు!  |   ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |  

త్వ‌ర‌లోనే మాకు అధికారం.. బాల‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు అధికారంలో ఉండ‌ద‌ని సినీ న‌టుడు, టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ఉందా లేదా అనే అనుమానం వ‌స్తోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఏపీలో తాము అధికారంలోకి వ‌చ్చేందుకు ఐదేళ్లు అవ‌స‌రం లేద‌ని, త్వ‌ర‌లోనే టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. ఒక్క‌సారి అవ‌కాశం అడిగి అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ విధ్వంసం సృష్టిస్తోంద‌న్నారు.

ఏపీలో అధికార పార్టీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు దారుణంగా ఉంద‌న్నారు. టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఎవ‌రికీ భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌ని పేర్కొన్నారు. కార్య‌క‌ర్త‌ల‌కు తాను నిత్యం అందుబాటులో ఉంటాన‌ని అన్నారు. ఎన్టీఆర్‌కు వార‌సుల‌ము తాము కాద‌ని, కార్య‌క‌ర్త‌లే ఆయ‌న‌కు నిజ‌మైన వార‌సుల‌ని బాల‌కృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ క‌ల‌ల‌ను చంద్ర‌బాబు నాయుడు సాకారం చేస్తున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. బాల‌కృష్ణ ఇవాళ త‌న తండ్రి జ‌యంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళుల‌ర్పించారు.

Related News