logo

  BREAKING NEWS

బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |   బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |  

బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు

బాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో లింకులు టాలీవుడ్‌లో తేలుతున్నాయి. ఇప్ప‌టికే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ డ్ర‌గ్స్ వినియోగించినట్లు ఆరోప‌ణ‌లు రాగా ఇప్పుడు మ‌రో పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు స‌తీమ‌ణి, ఒకప్ప‌టి హీరోయిన్ న‌మ్ర‌త శిరోద్క‌ర్ పేరును నేష‌న‌ల్ మీడియా ప్ర‌స్తావించింది. డ్ర‌గ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌ల‌పై హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజ‌ర్ జ‌య సాహాను ఎన్‌సీబీ విచారిస్తున్నారు.

డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లుగా జ‌యా సాహా వాంగ్మూలం ఇచ్చింది. ఎవ‌రెవ‌రికి ఆమె డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసింద‌నేది కూడా వెల్ల‌డించిన‌ట్లు చెబుతున్నారు. జ‌య సాహాతో డ్ర‌‌గ్స్ గురించి న‌మ్ర‌త సంభాష‌ణ‌లు జ‌రిపిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ‌ల‌కు సంబంధించిన వివ‌రాలు ఇవే అంటూ నేష‌న‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

జ‌య సాహాతో న‌మ్ర‌త‌ జ‌రిపిన సంభాష‌ణ‌లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న వివ‌రాల ప్ర‌కారం… “ముంబై వ‌చ్చిన‌ప్పుడు ఎండీ(డ్ర‌గ్స్) ఇస్తాన‌ని ప్రామిస్ చేశావు, ఇచ్చాక పార్టీ చేసుకుందాం” అని న‌మ్ర‌త అన్న‌ట్లు చెబుతున్నారు. అయితే, న‌మ్ర‌త గురించి వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని న‌మ్ర‌త కార్యాల‌యం తెలిపింది. ఈ వార్త‌ల‌ను ఎవ‌రూ న‌మ్మాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

Related News