సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. చిన్న సినిమాలు కూడా సంక్రాంతి పండక్కి విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఈ పండక్కి వచ్చిన సినిమాలన్నిటినీ ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. అయితే సరిగా 18 ఏళ్ల క్రితం సంక్రాతి సందర్భంగా విడుదలైన ‘ఒక్కడు’ సినిమా మహేష్ కెరీర్ లోనే మరిచిపోలేని విజయాన్ని అందించింది.
మహేష్ కెరీర్ ను ఒక్కడు సినిమాకు ముందు తర్వాత అన్న రేంజ్ లో ఈ సినిమా సత్తా చాటింది. ఈ సినిమాలో చార్మినార్ ఎంత కీలకమో తెలిసిందే. అప్పట్లోనే దర్శకుడు గుణశేఖర్ చార్మినార్ సెట్ వేసి అబ్బురపరిచాడు. అందుకోసం హైదరాబాద్ శివార్లలో నిర్మాత రామానాయుడికి చెందిన ఓ పదెకరాల స్థలాన్ని ఎంచుకున్నారు. కోటి డెబ్భై లక్షల వ్యయంతో ఈ సెట్ ను రూపొందించారు.
మహేష్ బాబు- భూమిక చావ్లా కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయ్యారు. మణిశర్మ అందించిన సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకు వెళ్ళింది. అయితే ఈ సినిమాకు ఈరోజుతో సరిగ్గా 18 ఏళ్ళు పూర్తయ్యాయి. 2003 జనవరి 15న విడుదలైని. ఈ సందర్భంగా మహేష్ బాబు సతీమణి నమ్రత ఒకడు సినిమాపై స్పందించారు.
ఈ సినిమా మహేష్ నటించిన సినిమాల్లోకెల్లా క్లాసిక్ హిట్ గా నిలిచిందన్నారు. అంతేగాక ఇది తనకు ఆల్ టైం ఫెవరెట్ అంటు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసారు. ఒక్కడు సినిమా తెలుగుతో పాటుగా తమిళం, కన్నడ, హిందీలో కూడా రీమేక్ అయ్యింది. తమిళంలో విజయ్, త్రిష జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.