logo

  BREAKING NEWS

బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |   బ్రేకింగ్‌: రైతుల కోసం జ‌గ‌న్ మ‌రో అద్భుత‌మైన ప‌థ‌కం  |   సోష‌ల్ మీడియాలో క‌నిపించే ఈ ఆఫ్రిక‌న్ బుడ్డోడి అస‌లు క‌థ ఇది  |  

24 గంటల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న యువతి..!

నల్గొండ జిల్లాకు చెందిన యువతికి 24 గంటల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు జరిగాయి. శుక్రవారం ఆమెకు మొదటి వివాహం జరగగా అనంతరం రెండో రోజే మరోసారి పెళ్లి పీటలు ఎక్కింది. వివరాల్లోకి వెళితే.. కనుగొండ మండలం శాబ్దులాపురానికి చెందిన మౌనిక కుటుంబం పదేళ్లుగా కురంపల్లిలో నివాసం ఉంటుంది. ఆమెకు దేవర కొండకు చెంది యవకుడితో వివాహం నిశ్చయం అయ్యింది.

శుక్రవారం నాడు పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది. అయితే ఈ పెళ్ళిలో ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. మౌనిక తనకు వరసకు మామయ్య అయ్యే రాజేష్ ను కొన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తుంది. మౌనిక పెళ్లి జరిగిన కొంత సమయానికే రాజేష్ పెళ్లి మండపానికి రావడంతో ఒక్కసారిగా అతనిని పట్టుకుని బాధతో ఏడ్చింది.

విషయం అర్థం చేసుకున్న వరుడు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళింది. పంచాయితీ పెద్దలు పెళ్లిని రద్దు చేసుకోవాలని తెలపడంతో వరుడి కుటంబం అక్కడి నుండి వెళ్ళిపోయింది. తన ప్రేమకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో మౌనిక -రాజేష్ లు శనివారం నాడు గ్రామంలోని స్థానికంగా ఉన్న గుడిలో బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

Related News