logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సన్నిహితుడి అరెస్ట్..!

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేశాడన్న కారణంతో సీఐడీ అధికారులు మూడు రోజుల క్రితం నలంద కృష్ణకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. తాజాగా ఈరోజు తెల్లవారుజామున ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విశాఖలోని సీఐడీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. నలంద కిషోర్ తో పాటుగా కృష్ణా జిల్లా, నందిగామ టీడీపీకి చెందిన చిరుమామిళ్ల కృష్ణను కూడా అరెస్టు చేసినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖలోని సీఐడీ కాయలయానికి వెళ్లారు. తమన సన్నిహితుడైన నలంద కిషోర్ అరెస్ట్ ను ఆయన ఖండించారు. నలంద కిషోర్ ను కలిసేందుకు ఆయన సీఐడీ కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా.. విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయనను లోపలికి అనుమతించలేదు. కాగా సీఐడీ తీరును ఆయన తప్పుబట్టారు.

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. కరోనా కష్టకాలంలో తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను ఇబ్బందిపెట్టే వారిపై అలాగే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిపై అనుచిత పోస్టింగులు పెట్టె వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కొందరు వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేసింది.

Related News