logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

భర్తకు బదులు ప్రియుడితో క్వారెంటైన్… డిపార్టుమెంటుకే షాకిచ్చిన మహిళా కానిస్టేబుల్

భర్తకు బదులుగా ప్రియుడితో క్వారెంటైన్ కేంద్రానికి వెళ్లిన మహిళా కానిస్టేబుల్ నిర్వాకం చూసి మొత్తం పోలీసు డిపార్టుమెంటే నివ్వరపోయింది. వివరాల్లోకి వెళితే.. నాగ్ పూర్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ కు అప్పటికే వివాహం అయ్యింది. గతంలో ప్రభుత్వానికి చెందిన ఒక ప్రాజెక్టు పై పనిచేస్తున్న సమయంలో ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతను కూడా వివాహితుడే. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఇటీవల మహిళా కానిస్టేబుల్ తో పని చేస్తున్న మరో ఉద్యోగినికి కరోనా పాజిటివ్ రావడంతో 14 రోజుల పాటు క్వారెంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. ఇక్కడే ఆమె అసలు డ్రామాకు తెర తీసింది. ప్రియుడిని వదిలి అన్ని రోజులపాటు ఉండలేనని భావించిన ఆమె తనతో పాటు తన భర్తపై కూడా ఈ ప్రభావం ఉండవచ్చని అతన్ని కూడా తనతో పాటు క్వారెంటైన్ లో ఉండనివ్వాలని అధికారులను కోరింది.

అందుకు వారు కూడా అనుమతివ్వడంతో భర్తను కాకుండా అతని స్థానంలో ప్రియుడితో కలిసి క్వారెంటైన్ కు వెళ్ళింది. వీరిద్దరికి కేటాయించిన గదిలో కొంతకాలం ఏకాంతంగా గడిపింది. అయితే ఈ విషయం తెలియని ప్రియుడి భార్య తన భర్త కనిపించడంలేదని మహారాష్ట్ర పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో అసలు విషయం బయటకొచ్చింది.

అయితే భర్త చేసిన పనికి మహిళ అతనిపై పీకల్లోతు కోపంతో ఊగిపోయింది. భర్తను తనకు అప్పగించాలని కోరగా పోలీసు అధికారులు మాత్రం కోవిడ్ నిబంధనల దృష్ట్యా అందుకు ఒప్పుకోలేదు. ప్రస్తుతం అతనిని వేరే క్వారెంటైన్ కు తరలించారు. ఇప్పుడు ఆ మహిళా కానిస్టేబుల్ కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. భారీ స్కెచ్ వేసి పోలీసులనే బురిడీ కొట్టించినందుకు ఆమెపై శాఖా పరమైన చర్యలకు డిపార్టుమెంటు సిద్ధమైంది.

Related News