logo

బిగ్ బాస్-4 వేదికపై సౌందర్యను గుర్తుచేసుకున్న నాగ్..

బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకులను అలరిస్తూ విజయవంతంగా ఎనిమిదోవారంలోకి అడుగుపెట్టింది. ఆదివారం రోజున ఎప్పటిలాగే హోస్ట్ గా నాగార్జున సందడి చేశారు. ఇంటి సభ్యులతో ఆటపాటలతో ప్రేక్షకులకు వినోదం పంచారు. అయితే ఈ వారం హౌస్ మేట్స్ కి మ్యుజిక్ వినిపించి ఆ పాట లిరిక్స్ చెప్పే టాస్క్ ను ఇచ్చారు నాగార్జున.

మొదట నాగార్జున నటించిన ‘హలొ బ్రదర్’ సినిమాలోని ‘ప్రియ రాగాలే’ పాట మ్యూజిక్ ను వినిపించగానే అభిజిత్ ముందుగా బజర్ నొక్కి ఈ పాట లిరిక్స్ ను పాడి వినిపించాడు. ఆ తర్వాత అమ్మరాజశేఖర్, హారిక ప్రియ రాగాలే పాటపై చేసిన డాన్స్ కు నాగార్జున బాగానే ఇంప్రెస్స్ అయ్యారు. అయితే ఈ సినిమాలో నాగార్జునతో దివంగత నటి సౌందర్య జతకట్టిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని నాగార్జున స్టేజిపై హౌస్ మేట్స్ తో చెప్తూ ఆనాటి మధుర జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకున్నారు.

ఇవివి దర్శకత్వం వహించిన హలొ బ్రదర్ సినిమాలో మొదట ఈపాట తోనే షూటింగ్ ను మొదలు పెట్టారు. ఆ రోజు ఈ పాట సెట్ లోనే మొదటిసారి సౌందర్యను కలిసాను. ఆమెను అలా చూడటం కూడా అదే తొలిసారి అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున. అంతలోనే ఆ రోజు పాటలో నేను కూడా ఉన్నాను సార్ అంటూ చెప్తాడు అమ్మరాజశేఖర్. అవునా నువ్వు అక్కడే ఉన్నావా అని నాగార్జున అడగగా లాస్ట్ రోజు గ్రూప్ డాన్సర్ గా వచ్చాను సార్ అని చెప్తాడు. అలా మరోసారి సౌందర్యను గుర్తుచేసుకున్నారు నాగ్.

Related News