logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

ఆ పాపం ఊరికే పోతుందా.. టీడీపీ నేతల అరెస్ట్ పై నాగబాబు..

నిన్న అచ్చెన్నాయుడు, నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి. అవినీతికి పాల్పడ్డారంటూ ఏపీలో టీడీపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తుందని ప్రతి పక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ వ్యవహారంపై తాజాగా సినీ నటుడు నాగబాబు షాకింగ్ కామెంట్స్ చేసారు.

‘టీడీపీ హయాంలో టీడీపీ నాయకురాలిని సోషల్ మీడియాలో ఏదో అన్నారని మా జనసేన కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టి అరెస్టు చేయించారు. వాళ్ళను గొడ్లను బాదినట్టు బాది, అంత హింస పెట్టిన టీడీపీ ఇప్పుడు ఒక నాయకుడి మీద స్కామ్ జరిగిందని పోలీసులు అరెస్టు చేస్తే మాత్రం టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా గగ్గోలు పెడుతున్నాయి’. అని మండిపడ్డారు.

వాళ్ళు కేవలం కార్యకర్తలు నాయకులు కారు అనేగా అప్పట్లో మీ ఉద్దేశ్యం. కర్మకు మెనూ లేదు.. ఫలితాన్ని అనుభవిస్తారు. మా జనసేన కార్యకర్తలను అరెస్టు చేసి కొట్టించిన పాపం అంత తేలిగ్గా పోతుందా? మా జనసైనికుల పట్ల మీరు ప్రవర్తించిన తీరును మేము ఎన్నటికీ మర్చిపోము’ అని నాగబాబు ట్విట్టర్ ద్వారా ధ్వజమెత్తారు.

Related News