logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

టాలీవుడ్ లో బంధుప్రీతి.. బాలయ్య, మహేష్, ఎన్టీఆర్ లపై నాగబాబు షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత ఎక్కడ చూసినా నేపోటిజం పైనే చర్చ జరుగుతుంది. కొంతకాలంగా టాలీవుడ్ కి కూడా బంధుప్రీతి సెగలు తగులుతున్నాయి. టాలీవుడ్ ను కొందరు బడా హీరోలు ఏలుతున్నారని వారి వారసులకు మాత్రమే అవకాశాలు ఉంటాయని మిగిలిన వారిని పరిశ్రమలోకి రానివ్వరంటూ వస్తున్నఆరోపణలపై మెగా బ్రదర్ నాగబాబు షాకింగ్ కామెంట్స్ చేసారు.

తన యూట్యూబ్ ఛానెల్ లో నాగబాబు మాట్లాడుతూ.. టాలీవుడ్ లో బంధుప్రీతి అనేది లేదు. వారసులు వచ్చినంత మాత్రాన కష్టపడకుండా ఎవ్వరు ఎదగలేదు. ఎంతటి స్టార్ హీరో వారసుడైన ప్రేక్షకులకు నచ్చకుంటే ఇంటిదారి పట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా కుటుంబం నుంచి వచ్చిన హీరోలంతా ఎంతో కష్టపడి పైకొచ్చారు. అలాగే అప్పటి తరం హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ , కృష్ణ వారసులు కూడా రెండు మూడు సినిమాలకు తండ్రల పేరు వాడుకున్నా తర్వాత తమ సొంత ప్రతిభతో పరిశ్రమలో నెగ్గుకుని వచ్చారన్నారు.

నాగార్జున తనకు తానుగానే మన్మథుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే వెంకటేష్, రానా, జూనియర్ ఎన్టీఆర్ ఇలా వీరంతా టాలెంట్ తోనే పరిశ్రమలో నిలదొక్కుకున్నారన్నారు. ఒకప్పుడు ఎంతో బొద్దుగా ఉండే మహేష్ బాబు సినిమాల కోసం ప్రతి రోజు కేబీఆర్ పార్కులో జాగింగ్ చేసేవాడు. అరవింద సామెత సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ 40 డిగ్రీల ఎండలో చొక్కా లేకుండా త్రాగడం నేను నా కళ్ళతో చూసాను. అదే విధంగా బాలయ్య బాబు తన ప్రత్యేకమైన నటన, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకాదరణ పొందారని నాగబాబు ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం.

అయినా వారసులైనంత మాత్రాన వారిమానాన వారిని వదిలేయాలా? అంటూ మండిపడ్డారు. ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో నెపోటిజం గురించి మాట్లాడటం తేలికైపోయింది. రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి వారు తమ కష్టాన్ని నమ్ముకుని పరిశ్రమలో ఎదగలేదా అంటూ ప్రశ్నించారు. తమ బావ అల్లు అరవింద్ కూడా ఒక్క మెగా హీరోలతోనే కాకుండా విజయ్, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్ వంటి హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తున్నారని నాగబాబు పేర్కొన్నారు.

Related News