logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

మెగా హీరోలకు అదే మైనస్: నాగబాబు కామెంట్స్!

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వైష్ణవ్ తేజ్ హీరోగా ‘ఉప్పెన’ వస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఇటీవల జరిగిన ఈ సినిమా ఈవెంట్ లో మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క మెగాస్టార్ తప్ప మరెవ్వరూ హాజరుకాకపోవడం ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేసింది.

కాగా ఈ విషయంపై తాజాగా నాగబాబు వివరణ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇంటిల్లిపాదీ వెళ్లడం కన్నా వాడిని ప్రోజెక్ట్ చేయడమే ముఖ్యమని భవించాము. అందుకే ఈవెంట్ కు ఎవరమూ రాలేదు. మా అందరికీ పెద్ద దిక్కు కాబట్టి అన్నయ ఈవెంట్ కు వచ్చారు. ఇండస్ట్రీలో అన్నయ, కళ్యాణ్ బాబు కొన్ని స్టాండర్డ్స్ ను సెట్ చేసారు. మా కుటుంబం నుంచి వాచ్చేవారంతా వాటిని అందుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.

లేదంటే అదే వారికెరీర్ కు మైనస్ గా నిలుస్తుందని అన్నారు. ఇక తన మేనల్లుడు వైష్ణ తేజ్ గురించి మాట్లాడుతూ.. చాలా మంచి మనసు గలవాడు. నిహారికకు వరుణ్ బాబుకు వాడంటే చాలా ఇష్టం. కళ్యాణ్ బాబు సూచన మేరకు తైవాన్ వెళ్లి బాక్సింగ్ నేర్చుకున్నాడు. వాడి టాలెంట్ ను ఎంకరేజ్ చేయండని నాగబాబు కోరారు.

Related News