logo

  BREAKING NEWS

తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ శుభవార్త!  |   అయోధ్య మసీదుపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!  |   మహారాష్ట్ర – కర్ణాటకకు మధ్య ఏమిటీ ‘బెల్గాం’ వివాదం?  |   తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక ? ఆ ఎమ్మెల్యే రాజీనామా ఖాయం..?  |   మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి చిరంజీవి..? త‌మ్ముడి వెంట అన్న..?  |   బైడెన్ సంచలన నిర్ణయం.. ప్రవాస భారతీయులకు భారీ ఊరట!  |   పీఆర్సీ నివేదిక లీక్: తెలంగాణ సర్కార్ సీరియస్..నిరాశలో ఉద్యోగులు!  |   బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |  

రోజా గెలిచింది.. నాగ‌బాబు ఓడాడు.. బొమ్మ అదిరింది బిస్కెట్‌

నాగ‌బాబు, రోజా జ‌డ్జిలుగా ఈటీవీలో జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రాం ఎంత సూప‌ర్ హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. తెలుగు బుల్లితెర‌లో ఈ షో ఒక సంచ‌ల‌నంగా నిలిచింది. రాజ‌కీయ విభేదాలు ఉన్నా నాగ‌బాబు, రోజా క‌లిసి ఈ ప్రోగ్రామ్‌ను బాగా న‌డిపించేవారు. ఈటీవీకి ఈ షో మంచి రేటింగ్‌ల‌ను సంపాదించి పెట్టింది. అయితే, తొమ్మిది నెల‌ల క్రితం అనూహ్యంగా నాగ‌బాబు జ‌బ‌ర్ద‌స్త్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. త‌న‌తో పాటు ఆ షో నుంచి చ‌మ్మ‌క్ చంద్ర‌, వేణు, ధ‌న్‌రాజ్‌, స‌ద్దాం వంటి మంచి క‌మెడియ‌న్లు కూడా జ‌బ‌ర్ద‌స్త్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు.

ఈటీవీ నుంచి జీటీవీలోకి వెళ్లిన నాగ‌బాబు ఆండ్ కో అక్క‌డ కూడా జ‌బ‌ర్ద‌స్త్ లాంటి షోనే అదిరింది పేరుతో ప్రారంభించారు. ఈ స‌మ‌యంలో నాగ‌బాబు జ‌బ‌ర్ద‌స్త్‌పైన‌, ఆ షో నిర్వాహ‌కుల‌పైనా ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. అదిరింది ప్రారంభించాక నాగ‌బాబు వ‌ర్సెస్ రోజా, అదిరింది వ‌ర్సెస్ జ‌బ‌ర్ద‌స్త్ అన్న‌ట్లుగా బుల్లితెర‌పై వార్ న‌డిచింది. జ‌బ‌ర్ద‌స్త్‌ను బీట్ చేసేందుకు నాగ‌బాబు చాలా ప్ర‌య‌త్నించారు.

ఇదే స‌మ‌యంలో జ‌బ‌ర్ద‌స్త్‌లోనూ నాగ‌బాబు లేని లోటు బాగానే క‌నిపించింది. చాలా మంది జ‌డ్జిలు మారారు. కానీ, క్ర‌మంగా జ‌బ‌ర్ద‌స్త్ సెట్ అయ్యింది. మంచి రేటింగ్స్ వ‌స్తున్నాయి. నాగ‌బాబు అదిరింది మాత్రం జ‌బ‌ర్ద‌స్త్‌కు గ‌ట్టి పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. ఆశించిన స్థాయిలో అదిరింది షోకి రేటింగ్స్ రాలేదు. కొన్ని మార్పు చేర్పులు చేసి అదిరింది షోని బొమ్మ అదిరిందిగా పేరు మార్చి మ‌ళ్లీ కొత్త‌గా ట్రై చేశారు. అయినా కూడా జ‌బ‌ర్ద‌స్త్‌తో ప‌లిస్తే చాలా త‌క్కువ రేటింగ్స్ వ‌చ్చాయి.

దీనికి తోడు వివాదాలను న‌మ్ముకోవ‌డం కూడా అదిరింది షో ని దెబ్బ‌తీసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను అభ్యంత‌ర‌క‌ర‌మైన రీతిలో ఇమిటేట్ చేయించారు. దీంతో వివాదం చెల‌రేగింది. జ‌గ‌న్ అభిమానులు అదిరింది షోపైన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో యాక్ట‌ర్లు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. కానీ, నాగ‌బాబు మాత్రం జ‌గ‌న్ అభిమానుల‌ను మరింత రెచ్చ‌గొట్టారు. ఇది కూడా అదిరింది షోకి దెబ్బ కొట్టింది.

ఇలా ర‌క‌ర‌కాల ఇబ్బందుల‌తో కొన‌సాగుతున్న అదిరింది ఇప్పుడు ఆగిపోయింది. ఈ షో ఇప్పుడు ప్ర‌సారం కావ‌డం లేదు. దీంతో అదిరిందిని న‌మ్ముకొని జ‌బ‌ర్ద‌స్త్ నుంచి వెళ్లిపోయిన క‌మెడియ‌న్ల భ‌విష్య‌త్ ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌క‌మైంది. అయితే, నాగ‌బాబు మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్‌లోకి వెళ్లే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌నే ప్ర‌చారం సాగుతోంది. నాగ‌బాబు మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్‌లోకి వ‌స్తే బాగుంటుంద‌ని గెట‌ప్ శ్రీను చిన్న హింట్ ఇచ్చారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Related News