logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకోవ‌డానికి నిత్యం వేలాది మంది దేశం న‌లుమూల‌ల నుంచి త‌ర‌లివ‌స్తుంటారు. తిరుప‌తికి రావ‌డానికి ఎక్కువ మంది రైలు మార్గాన్నే ఎంచుకుంటారు. అందుకే, తిరుప‌తి నుంచి దాదాపుగా దేశంలోని అన్ని ప్ర‌ధాన న‌గరాల‌కు రైళ్లు ఉన్నాయి. ప్ర‌తీ రోజూ 30 వేల నుంచి 50 వేల మంది వ‌ర‌కు తిరుప‌తి రైల్వే స్టేష‌న్ నుంచి ప్ర‌యాణిస్తుంటారు. దీంతో ప్ర‌స్తుత రైల్వే స్టేష‌న్ ఎప్పుడూ కిక్కిరిసి ఉంటుంది. సాయంత్రం వేళ‌ల్లో అయితే మొత్తం నిండిపోతుంది.

ఈ నేప‌థ్యంలో తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌ను ర‌ద్దీకి స‌రిప‌డేలా అభివృద్ధి చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. తిరుప‌తిలోని ప్ర‌స్తుత రైల్వే స్టేష‌న్‌నే ప్ర‌పంచ‌స్థాయి ప్ర‌మాణాల‌తో పున‌ర్నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే డిజైన్లు కూడా పూర్త‌య్యాయి. ఈ విష‌యాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ ప్ర‌క‌టించారు. తిరుప‌తి రైల్వే స్టేష‌న్ కొత్త డిజైన్ ఫోటోల‌ను ఆయ‌న ట్వీట్ చేశారు.

డిజైన్లు పూర్త‌య్యాయ‌ని, కాంట్రాక్ట‌రు కూడా ఖ‌రార‌య్యార‌ని, త్వ‌ర‌లోనే తిరుప‌తి రైల్వే స్టేష‌న్ పున‌ర్నిర్మాణ ప‌నులు ప్రారంభం అవుతాయ‌ని అశ్వినీ వైష్ణ‌వ్ ట్వీట్ చేశారు. అయితే, ఆయ‌న ట్వీట్ చేసిన డిజైన్ల‌పై చాలా మంది అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా, సినీ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కూడా ఈ డిజైన్ల‌పైన స్పందించారు. డిజైన్ల‌పై తన అసంతృప్తిని ఆయన ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా నేరుగా మంత్రి దృష్టికే తీసుకెళ్లారు.

‘డియ‌ర్ స‌ర్‌, కొత్త రైల్వే స్టేష‌న్ డిజైన్‌ను ఎవ‌రూ న‌చ్చ‌డం లేదు. ప్ర‌జ‌లు చేస్తున్న కామెంట్ల‌ను మీరు కూడా చూసే ఉంటారు. వెస్ట్రెన్ స్టైల్ డిజైన్‌ను కాపీ చేసిన‌ట్లుగా, ఒక చెత్త ఐటీ పార్కు లాగా ఈ డిజైన్ ఉంది. తిరుప‌తి చాలా ప‌విత్ర‌మైన‌ది. ఎంతో ఆధ్యాత్మిక‌త ఉన్న ప్రాంతం. కాబ‌ట్టి, అత్యున్న‌త‌మైన మ‌న భార‌తీయ ఆర్కిటెక్చ‌ర్‌పై ప‌ట్టున్న వారి చేత డిజైన్ చేయించండి. గ్లాస్‌, స్టీల్‌తో ఉన్న భ‌వ‌నాలను కాపీ చేయ‌కండి..’ అంటూ నాగ్ అశ్విన్ రైల్వే మినిస్ట‌ర్‌కు ట్వీట్ చేశారు.

చాలామంది నెటిజ‌న్లు సైతం నాగ్ అశ్విన్ ట్వీట్‌ను స‌పోర్ట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. కొత్త రైల్వే స్టేష‌న్ డిజైన్ అంత బాగోలేద‌ని అంటున్నారు. తిరుప‌తి ఆధ్యాత్మిక వైభ‌వాన్ని చాటి చెప్పేలా రైల్వే స్టేష‌న్ డిజైన్ ఉంటే బాగుంటుంద‌ని నెటిజ‌న్లు రిక్వెస్ట్ చేస్తున్నారు. మ‌రి, ప్ర‌జ‌ల స్పంద‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని డిజైన్ మారుస్తారా, లేదా చూడాలి.

 

Related News