logo

  BREAKING NEWS

ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |  

పుజారా, జడేజా, రాహుల్ తో సహా.. మహిళా క్రికెటర్లకు నోటీసులు!

లాక్ డౌన్ సమయంలో తాము ఎక్కడున్న విషయం తెలపలేదనే కారణంతో ఐదుగురు భారతీయ క్రికెటర్లకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజన్సీ (నాడా) నోటీసులు అందించింది. వీరిలో టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా లతో పాటుగా మహిళా క్రికెటర్లు స్మృతి మందన్న, దీప్తి శర్మ‌లు కూడా నోటీసులు అందుకున్నారు.

సాధారణంగా మ్యాచ్ ఫిక్సింగ్ లు, బుకీల సంప్రదింపులను కట్టడి చేసేందుకే క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు కొన్ని ఆంక్షలను విదిస్తుంది. అందులో భాగంగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఉన్న క్రికెటర్ల పై బీసీసీఐ నిఘా ఉంచుతుంది. మ్యాచ్ లు లేని సమయంలో ఆటగాళ్లు తమ ప్రయాణాలు, విదేశీ టూర్లకు సంబందించిన వివరాల్ని బోర్డుకు తెలియజేయవలసి ఉంటుంది. అలాగే నాడా కూడా రెగ్యులర్ గా ఆటగాళ్ల నుంచి సమాచారం సేకరిస్తుంది. ఆటగాళ్లు బిజీగా ఉంది ఆ వివరాలను తెలుపలేని పక్షంలో బీసీసీఐ ఆ బాధ్యతను తీసుకుంటుంది. నాడాకు చెందిన సైట్లో ఈ వివరాలు నమోదు చేస్తారు.

తాజాగా టీమిండియా ఆటగాళ్లు ఆ వివరాలను తెలపడంలో విఫలమైన కారణంగా నాడా ఈ ఐదుగురికి నోటీసులు పంపింది. అయితే దీనిపై స్పందించిన బీసీసీఐ ఆ సంబంధింత ఫారం కు సంబంధించి ఓ లోపం తలెత్తిన కారణంగానే ఇలా జరిగిందని నాడా కు తెలియజేసింది. వారి వివరణ న్యాయమైనదిగా అనిపించడంతో యాంటీ డోపింగ్ అడ్మినిస్ట్రేషన్ & మేనేజ్‌మెంట్ దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనుందని సంస్థ ఛైర్మెన్ నవీన్ అగర్వాల్ వెల్లడించారు.

Related News