logo

  BREAKING NEWS

మే 15 లోపు వాట్సాప్ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయకుంటే ఏమవుతుంది?  |   జ‌గ‌న్ – ష‌ర్మిల మ‌ధ్య విభేదాలు 100 % నిజం.. ఇదే సాక్ష్యం  |   శ‌త్రువులు కూడా ఈ విష‌యంలో జ‌గ‌న్‌ను శ‌భాష్ అంటారు  |   కరోనాను అడ్డుకునే అస్త్రం అదొక్కటే.. శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు  |   శుభవార్త: తగ్గిన బంగారం ధరలు 16.04.2021 బంగారం, వెండి ధరలు  |   కరోనా తీవ్ర ఇన్ఫెక్షన్ వీరిలోనే ఎక్కువ.. కారణం ఇదే  |   పెరిగిన బంగారం ధరలు 15.04.2021 బంగారం, వెండి ధరలు  |   బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |  

రోజంతా కనిపించి అదృశ్యమయ్యే శివాలయం.. ఎక్కడుందో తెలుసా?

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న దేవుడు పరమేశ్వరుడు. అయన చుట్టూ ఎన్నో కథలు, పురాణాలు ఉన్నాయి. శివుడు అభిషేక ప్రియుడని, శివలింగంపై కాసిన్ని నీళ్లు పోసినా అయన సంతోషంతో పొంగిపోతాడని చెబుతారు. అందుకేనేమో ఈ ఆలయంలో నిత్యం సముద్రుడే వచ్చి శివుడిని అభిషేకించి తరిస్తాడు.

సముద్ర తీరంలో నిర్మించిన ఆలయాలు కాలక్రమేణా మునిగిపోవడం సహజమే. నీటి మట్టం తగ్గినప్పుడు భక్తులు వెళ్లి అక్కడ దర్శనం చేసుకోవడం వంటివి కూడా చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా అలల తాకిడికి అదృశ్యమై అంతలోనే కనిపిస్తూ ఉండే ఈ రహస్య ఆలయాన్ని చూడాలంటే గుజరాత్ లోని స్తంభేశ్వర ఆలయాన్ని దర్శించాల్సిందే.

రోజులో రేండు సార్లు సముద్రుడు ఈ ఆలయంలోని శివలింగాన్ని దర్శించడానికి వస్తాడు. ఆ సమయంలో ఆలయం మొత్తం సముద్రంలోకి మునిగిపోతుంది. ఈ వింతను చూడటానికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తారు. ఆలయం బయటకు రావడం దగ్గర నుండి సముద్రంలో మునిగిపోయేవరకు జరిగే మొత్తం క్రమాన్ని చూడటానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు తీరం వద్దనే వేచి చూస్తారు.

అంతేకాదు ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. చంద్రుడి కళలను అనుసరిస్తూ ఒక్కో రోజు ఒక్కో విధంగా ఈ ఆలయం దర్శనమిస్తుంది. అయితే ఈ ఆలయాన్ని కావాలనే ఇలా నిర్మించారా? లేక కాలక్రమేణా చోటుచేసుకున్న మార్పుల వల్ల ఇలా మారిందా అనే విషయాన్ని మాత్రం చెప్పడం కష్టం.

వడోదర నుంచి 75 కిలోమీటర్ల దూరంలో కవికంబోయి అనే గ్రామంలో ఉన్న స్తంభేశ్వర ఆలయం అత్యంత పురాతన ఆలయం. ఈ ఆలయం సమీపంలోనే మహీనది అరేబియా సముద్రంలో సంగమించడం విశేషం. శివపుత్రుడైన కార్తికేయుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడని చెబుతారు. అందుకు సంబందించిన ఓ స్థల పురాణం కూడా ప్రాచుర్యంలో ఉంది.

శివుని కుమారుడైన కార్తికేయడు లోకరక్షణార్థం తారకాసురిడిని సంహరించిన కథ తెలిసిందే. అయితే తారకాసురుడు ఎంత రాక్షసుడైనా అతను మహాశివ భక్తుడు. ఆ విషయం తెలుసుకున్న కార్తికేయుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. తాను చేసిన పనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావిస్తాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై శివభక్తుడిని సంహరించిన అపచారం శివపూజ తోనే తొలగిపోతుంది అని సూచిస్తాడు.

విష్ణుమూర్తి ఆదేశానుసారం కార్తికేయుడు విశ్వకర్మ చేత మూడు శివలింగాలను చెక్కిస్తాడు. అందులో ఒకదానిని సముద్రం మధ్యన ప్రతిష్టిస్తాడు. అదే ఇప్పటి స్తంభేశ్వర ఆలయంగా చెబుతారు. స్కాంద పురాణం, శివ మహాపురాణంలోనూ కార్తికేయుడి చేతుల మీదుగా ప్రతిష్టించబడిన ఈ మహా శివుడి ఆలయం గురించి వివరించబడి ఉంది. మహా శివరాత్రి రోజున, ప్రతి మావాస్య రోజున ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు.

ఎలా చేరుకోవాలి:
రోడ్డు మార్గం ద్వారా వడోదరా నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. అక్కడి నుండి ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. రైలు మార్గం ద్వారా అయితే కంబోయ్ స్టేషన్ నుండి ఇక్కడకు చేరుకోవచ్చు.

Related News