ఒక వైపు కరోనా కోరలు చాస్తుంటే ఇప్పుడు మరో విచిత్రమైన వ్యాధి ఏపీ ప్రజలను కలవరపెడుతుంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జనం ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 227 కు చేరింది. ఈ వ్యాధి సోకిన ప్రజలు నురగలు కక్కుతూ సొమ్మసిల్లిపడిపోతున్నారు. మూర్ఛ, వాంతులు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పటివరకు 70 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
మరికొంత మంది వింతగా ప్రవర్తిస్తుండటం కలవరపెడుతుంది. దీంతో అస్వస్థతకు గురైన వారంతా స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. మరికొందరు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అయితే ఈ వ్యాధికి గల కారణాలు అంతు చిక్కడం లేదు. అయితే దీనిని మాస్ హిస్టీరియాగా వైద్యులు భావిస్తున్నారు. ఈ వ్యాధి సోకినవారికి ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదన్నారు.
ఏ ఘటనపై సీఐ జగన్ ఆరా తీశారు. అక్కడ పరిస్థితులు మెరుగయ్యేవరకు అందుబాటులో ఉండాలని మంత్రిని ఆదేశించారు. మంత్రి ఆళ్ళ నాని బాధితులను పరామర్శించి వైద్యులను పరిస్థితులను అడిగి తెసులుసుకున్నారు. వ్యాధి లక్షణాలు తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపించి అక్కడి నీటి నమూనాలను సేకరిస్తున్నారు. బాధితులకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసారు.
ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదని ప్రజలెవరూ భయాదవద్దని మంత్రి ప్రజలకు భరోసానిచ్చారు. ఓ బాధితుడు మాట్లాడుతూ.. తాను శనివారం పనికి వెళ్ళివచ్చానని ఆ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పెద్దగా అరిచి కిందపడిపోయానన్నాడు. ఆ తర్వాత కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయని వివరించాడు.