logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

బిగ్ బాస్ హౌస్ లో యూట్యూబ్ స్టార్ ‘గంగవ్వ’…?

‘మై విలేజ్ షో’తో యూట్యూబ్ స్టార్ గా మారిన గంగవ్వకు బిగ్ బాస్ నుంచి పిలుపు అందినట్టుగా తెలుస్తుంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూట్యూబ్ నుంచి ఏకంగా వెండి తెర అవకాశాలను సైతం దక్కించుకున్న గంగవ్వ విజయ్ దేవరకొండ, సమంత, కాజల్ వంటి తారలను కూడా ఇంటర్వ్యూ చేసి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాగా ఇప్పటికే గంగవ్వకు హౌస్ లోకి వెళ్లే ఆఫర్ వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. కాగా ఈ వార్త తెలిసిన ప్రేక్షకులు గంగవ్వ నిజంగానే బిగ్ బాస్ లో పాల్గొంటుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా బిగ్ బాస్ సీజన్ 1 లో గ్రామీణ నేపథ్యం ఉన్న హీరో సంపూర్ణేష్ బాబును హౌస్ లోకి పంపిన విషయం తెలిసిందే.

అయితే కొన్ని కారణాల వల్ల సంపూ హౌస్ లో నుంచి తనకు తానుగా బయటకు వచ్చేసాడు. స్టేజీ మీద, సోషల్ మీడియాలో తనదైన తెలంగాణ యాసతో ఆకట్టుకునే గంగవ్వ బిగ్ బాస్ లో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుంది. అసలు అంత మంది సెలబ్రిటీల మధ్య ఉండగలదా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే గత సీజన్లలో కూడా గంగవ్వ వయసు వారిని తీసుకున్న దాఖలాలు లేవు. మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Related News