logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

ఎండాకాలంలోఇవి తింటే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిందే!

ఎండాకాలం వచ్చిందంటే చాలు వడదెబ్బ తగలడం, వాంతులు, విరోచనాలతో ఆస్పత్రుల పాలవుతుంటారు. అందుకు మన ఆహారపు అలవాట్లు కూడా కారణమవుతుంటాయి. కొంత మందికి ఎక్కువగా వేడి చేస్తుంటుంది. అలాంటి వారు వేడి చేసే పదార్థాలను తింటే డీహైడ్రేషన్ బారినపడతారు. అప్పుడే తలనొప్పి, మలబద్దకం, నీరసం లాంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇలాంటి వారు వేసవిలో అస్సలు తినకూడని ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

బిర్యానీలు, మాంసాహారం, శరీరానికి వేడి చేసే మసాల దినుసులు, కారం ఎక్కువగా ఉండే పచ్చళ్ళు, వేపుడు పదార్ధాల జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఇవి శరీరంలో వేడిని అమాంతం పెంచేస్తాయి. అలాగే మిరియాలు, వెల్లుల్లి, ఆవాలు, నూనే తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిది. అందుకు బదులుగా ఇంగువ, మెంతి పొడిని రుచి కోసం వాడుకోవచ్చు. ఇక మాంసాహారం విషయానికొస్తే.. గుడ్లు, చికెన్, రొయ్యలు, పీతలు ఎండాకాలంలో అస్సలు తినకూడనివి. వీటి ద్వారా వేడి చేయడమే కాకుండా జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి. డయేరియా లాంటి వ్యాధుల బారిన పడతారు. వీటిని వండే సమయంలో మసాలా దినుసులు కలిపితే అవి ఇంకా వేడిని పెంచేస్తాయి.

చాలా మంది అన్నానికి బదులుగా గోధుమ రొట్టెలను తింటారు. గోధుమలు వేడి చేసే స్వభావం కలవి. శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తాయి. కాబట్టి అందుకు బదులుగా అన్నం లేదా జొన్నరొట్టెలు తినవచ్చు. వేసవిలో పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. అయితే మామిడి పళ్ళ సీజన్ కాబట్టి వాటిని ఎక్కువగా తినేస్తుంటారు. మామిడి పళ్ళు విపరీతమైన వేడిని పెంచుతాయి. అందువల్ల శరీరంపై వేడి గుల్లలు వస్తాయి. అలాగే పైన్ ఆపిల్, పొప్పడి పండును కూడా వీలైనంత తక్కువగా తీసుకోవాలి.

ఎక్కువగా వేడి చేసేవారు అన్నం తిన్నాక చివరలో తప్పక మజ్జిగ అన్నం తినాలి. రోజు మూడు టీ స్పూన్‌ల సబ్జా గింజలను నానబెట్టుకుని తినాలి. లేదా గాజు గ్లాసులో మూడు వంతుల నీళ్ళను పోసి అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచం ఖండ శక్కర (మిశ్రి ) వేసి ఉదయం నానబెట్టి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆ నీటిని క్రమం తప్పకుండా త్రాగితే మంచి ఫలితాలు వస్తాయి. శరీరంలో ఉన్న అధిక వేడిని ఇది నివారిస్తుంది. ఉదయాన్నే కలబంద గుజ్జును సన్నగా తరుగుకుని తినడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. నేరుగా తినలేని వారు రుచి కోసం కొంచెం చక్కర కలుపుకుని తినవచ్చు. అలాగని కలబందను ఒకేసారి ఎక్కువ మొత్తం లో తీసుకుంటే విరేచనాలకు కారణమవుతుంది.

Related News