logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

బట్టతల దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడని..

వెయ్యి అబద్ధాలాడైన ఓ పెళ్లి చేయాలని పెద్దలు చెప్తుంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది. చిన్న చిన్న విషయాలకే జంటలు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. అలాంటిది ఓ వ్యక్తి పెళ్ళికి ముందు భార్యతో తనకు బట్టతల ఉన్న విషయం చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లిలో ఎలాగోలా విగ్గుతో మ్యానేజ్ చేసినా ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ విషయం భార్యకు తెలిసింది.

ఈరోజుల్లో బట్టతల చాలా కామన్ అని చెప్పినా భార్య వినలేదు. అత్తమామలు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసినా తనను మోసం చేసావంటూ భర్తను నిలదీసింది. అంతటితో ఆగకుండా భర్తపై ఏకంగా కేసు పెట్టింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ ఘటన చోటుచేసుకుంది. నయీ నగర్ కు చెందిన 27 మహిళ నగరంలో చార్టెడ్ అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తుంది.

ఆమెకు గత నెల మీరా రోడ్డు ప్రాంతంలో నివాసముండే 29 ఏళ్ల వ్యక్తితో పెద్దలు వివాహం జరిపించారు. అయితే తనకు పెళ్ళికి ముందు బట్టతల విషయం చెప్పకుండా మోసం చేసాడని తన పరువుకు నష్టం కలిగించాడని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తన భర్తకు సహకరించిన అత్తా మమాలపైనా కేసులు పెట్టింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మిడిల్ తెగ వైరల్ అవుతుంది.

Related News