logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

ఈ పండ్లు ఎక్కడైనా కనబడితే అస్సలు వదలకండి

ఇదివరకు అడవుల్లో మాత్రమే దొరికే మల్బరీ పండ్లను వివిధ ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. దీంతో చాలా మార్కెట్లలో ఈ మల్బరీ పండ్లు దర్శనమిస్తున్నాయి. వీటినే బొంత పండ్లు అని కూడా అంటారు. చాలా మందికి ఈ పండ్ల గురించి తెలియక వీటిని కొనరు. కానీ వీటి ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచి వీటిది.

రుచికి మాత్రమే కాదు ఔషధ గుణాలలో కూడా వీటికివే సాటి. ప్రపంచవ్యాప్తంగా ఈ పండ్ల వినియోగం భారీగా పెరిగిపోతుంది. చైనా లాంటి దేశాలలో వారి సంప్రదాయ ఔషధాలలో కూడా ఈ పండ్లను వాటి ఆకులను వినియోగిస్తుంటారు. షుగర్ లెవల్స్ ను అదుపులోకి తేవడానికి ఈ పండ్లు అద్భుతంగా పని చేస్తాయి. ఈ చెట్టులోని అన్ని భాగాలలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే రెస్వెట్రాల్ అనే పదార్థం వయసును తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి. ఈ పండ్లు ఎక్కువగా తినేవారు సహజంగానే యవ్వనంగా కనిపిస్తారు.

అనేక చర్మ సమస్యలపై ఇందులో ఉండే ఔషధ గుణాలు పోరాడతాయి. దద్దుర్లు, చర్మంపై ఎర్రటి మచ్చలతో బాధపడేవారు ఈ ఆకుల రసాన్ని రాస్తే తగ్గిపోతాయి. ఈ పండ్లలో ప్రోటీన్ తో పాటుగా విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, ఐరన్ లు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వలన రోజంతా యాక్టివ్ గా ఉంటారు. అంతే కాదు నోటి దుర్వాసనతో బాధపడేవారు ఈ పండ్లు తింటే నోటి దుర్వాసన మాయమైపోతుంది. సహజమైన మౌత్ ఫ్రెష్నర్ గా ఈ పండ్లను పిలుస్తారు.

చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఈ పండ్లను అస్సలు వదలరు. రక్తనాళాలను సడలించి గుండ జబ్బులు రాకుండా మల్బరీ పండ్లు నివారిస్తాయి. ఎముకలకు కొత్త శక్తిని అందిస్తాయి. కంటిలో శుక్లాలను తొలగించడంలో ఉపయోగపడతాయి. ఈ పండ్లు మీకు అందుబాటులో లేకపోతే నర్సరీలలో లభించే మల్బరీ మొక్కలను తెచ్చి పెంచుకోవచ్చు. వీటిని పెంచడం ఎంతో తేలిక.

Related News