logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ సంచలన నిర్ణయం..!

కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాపు ఉద్యమం నుంచి తాను తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయాన్ని కాపు సామాజిక వర్గానికి బహిరంగ లేఖ ద్వారా తెలియజేసారు. తనపై సోషల్ మీడియాలో దాడులు జరుపుతున్నారని, అవకాశవాది, కులద్రోహి, గజదొంగ అంటూ నానా రకాలుగా తనను తిట్టిపోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇవి తనను మానసికంగా కుంగదీస్తున్నాయన్నారు.

ఉద్యమ సమయంలో తాను రాజకీయంగా, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కూడా దెబ్బతిన్నానని అన్నారు. గత ప్రభుత్వం మీద ఒంటి కాలితో లేచిన ముద్రగడ ఇపుడు కాళ్ళు పడిపోయాయా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారన్నారు. తాను ఉద్యమం ప్రారంభించింది చంద్రబాబు కోసమే అని, ఆయన రిజర్వేషన్ల విషయంలో మాట తప్పారు కాబట్టే ఉద్యమం చేపట్టానని అన్నారు.

ఈ ఉద్యమం తాను ఎలాంటి పదవులు, డబ్బు ఆశించి చేయలేదన్నారు. దాని వల్ల తాను ఎంత నష్టపోయానో అందరికీ తెలుసు. కానీ నేను ఏనాడు బాధపడలేదు. ఇప్పటిదాకా మన జాతి కోసమే పోరాటం చేశాను. కానీ ఇప్పుడు నాపై వస్తున్న ఈ విమర్శలతో తీవ్రంగా కలత చెందానని అందుకే ఉద్యమం నుంచి వైదొలుగుతున్నా అంటూ ముద్రగడ లేక ద్వారా ప్రకటించారు.

Related News