logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

ఎంపీసీ చదవని వారు కూడా ఇంజినీరింగ్ చదవచ్చు..!

మన దేశంలో ఇంజినీరింగ్ కోరుసలో చేరాలంటే ఇంటర్ స్థాయిలో తప్పకుండా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబీజెక్టులు చదివిన వారై ఉండాలి. ఇవి లేకుండా ఇంజినీరింగ్ లో ప్రవేశాలు పొందే అవకాశం ఉండేది కాదు. తాజాగా నూతన జాతీయ విద్యా విధానం లో భాగంగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది విద్యా శాఖ. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నీకల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఓ హ్యాన్డ్ బుక్ ను విడుదల చేసింది.

ఏఐసీటీఈ పేర్కొన్న సబీజెక్టుల్లో ఏవైనా 14 సబ్జెక్టుల్లో ఇంటర్ లేదా ప్లస్ టూ స్థాయిలో చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్ లో చేరేలా అవకాశం కల్పించింది. ఈ లిస్టులో ఫిజిక్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నలజి , బయాలజీ, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్, బయోటెక్నాలజి, టెక్నీకల్ ఒకేషనల్ సబ్జెక్ట్స్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ గ్రాఫిక్స్, బిజినెస్ స్టడీస్, ఎంట్రప్రెన్యూర్ షిప్ సబ్జెక్టులు ఉన్నాయి.

ఈ సబ్జెక్టుల్లో ఏదైనా మూడింటిలో కనీసం 45 శతం మార్కులతో పాసైన విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరిపోవచ్చు. అయితే ఇలా చేరిన విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంజినీరింగ్ డ్రాయింగ్స్ లాంటి సబ్జెక్టులను చేర్చి వారికి సబ్జెక్టులపై మరింత అవగాహన ఏర్పడేలా శిక్షణ ఇవ్వాలని ఏఐసీటీఈ ఇంజినీరింగ్ కాలేజీలకు సూచించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎంపీసీ చేసిన వారే ఇంజినీరింగ్ కోర్సులో చేరుతున్నారు.

ఇక బైపీసీ చేసిన విద్యార్థులు కొందరు బీటెక్ బయోటెక్నాలజీలో చేరుతున్నారు. ఇప్పుడు ఏ కోర్సు చదివినా ఇంజినీరింగ్ లో చేరేలా ఏఐసీటీఈ అవకాశం కల్పించింది. ఈ విధానం 2021- 2022 విద్యా సంవత్సరం నుంచే చేయనున్నారు. అయితే ఈ అంశంపై ఆయా రాష్ట్రాలకు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను ఇస్తున్నట్టుగా కేంద్రం తెలిపింది

Related News
%d bloggers like this: