logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

వెంకయ్యనాయుడుకు విజయసాయిరెడ్డి లేఖ.. ఆ టీడీపి ఎంపీపై చర్యలకు డిమాండ్!

రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ పై వైఎస్ఆర్సీపి ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడుకు ఆయన ఫిర్యాదు చేసారు. ఈ మేరకు విజయసాయి రెడ్డి లేఖ రాశారు. ఫిబ్రవరి 4వ తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కనక మేడల చేసిన వ్యాఖ్యలు సభా విరుద్దమని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

ఆయన తన ప్రసంగంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించకపోవడం దురదృష్టకరమని ఆయన లేఖలో ప్రస్తావించారు. తన ప్రసంగంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యకలాపాల గురించి, అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల గురించి కనకమేడల చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవిగా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

సభలో చర్చ జరిగే సమయంలో ఆ అంశాన్ని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థల కార్యకలాపాలపై వ్యక్తులపైన కనకమేడల చేసిన అసహ్యమైన వ్యాఖ్యలు రాజ్యసభ రోల్ 238(3), రూల్ 238(5) ఉలంఘన అవుతుందని ఫిర్యాదులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విద్వేషపూరిత రాజకీయాలలో భాగంగానే కనకమేడల ప్రసంగాన్ని భావించాల్సి ఉందన్నారు. వీటిని పరిశీలించి ఆ సభ్యుడిపై తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో సూచించారు.

Related News
%d bloggers like this: