logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

బుర‌ద పూసుకొని, శంఖం ఊదిన ఎంపీని వ‌ద‌ల‌ని క‌రోనా

దేశంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం మొద‌ల‌య్యాక చిత్ర‌విచిత్రమైన చికిత్సా విధానాల‌ను చెబుతున్నారు కొంద‌రు. ఈ లిస్టులో రాజ‌కీయ నాయ‌కులు కూడా ఉన్నారు. క‌రోనాను ఎదుర్కోవ‌డానికి బాబిజీ పాప‌డాలు తినాల‌ని ఒక‌రు, గోమూత్రం తాగాల‌ని మ‌రొక‌రు చెప్పారు. రాజ‌స్థాన్‌కు చెందిన బీజేపీ ఎంపీ సుఖ్‌బీర్ సింగ్ అయితే మ‌రీ విచిత్ర‌మైన ప‌ద్ధ‌తిని చెప్పారు. బుర‌ద మ‌ట్టి ఒంటి నిండా పూసుకొని శంఖం ఊదితే క‌రోనాను ఎదుర్కునే శ‌క్తి మ‌న‌లో పెరుగుతుంద‌ని చెప్పారు.

అంతేకాదు ఆయ‌న బ‌ట్ట‌లు విప్పి బుర‌ద గుంట‌లోకి వెళ్లి, ఒంటి నిండా బుర‌ద పూసుకొని శంఖం ఊదారు. త‌న‌లాగే అంద‌రూ చేయాల‌ని, ఇలా చేస్తే క‌రోనా రాద‌ని చెప్పారు. ఆయ‌న వీడియో దేశ‌వ్యాప్తంగా వైర‌ల్ అయ్యింది. ఎంపీ చేసిన ఈ ప్ర‌చారంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే, ఇప్పుడు ఈ ఎంపీనే క‌రోనా బారిన ప‌డ్డారు.

పార్ల‌మెంటు స‌మావేశాలకు ముందు ఎంపీలంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా 30 మంది ఎంపీల‌కు క‌రోనా పాజిటీవ్‌గా తేలింది. ఈ 30 మందిలో సుఖ్‌బీర్ సింగ్ కూడా ఒక‌రు. ఆయ‌న బుర‌ద మ‌ట్టి పూసుకొని, శంఖం ఊదినా క‌రోనా మాత్రం ఆయ‌న‌ను విడిచిపెట్ట‌లేదు. కాగా, బాబిజీ పాప‌డాలు తింటే క‌రోనా రాద‌ని చెప్పిన ఓ కేంద్ర‌మంత్రి ఆ త‌ర్వాత క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే.

Related News