logo

  BREAKING NEWS

RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |  

క్షీణించిన ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం..

సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ ఇంట కొద్ది రోజులుగా కరోనా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. నవనీత్ కౌర్ సహా ఆమె కుటుంబంలోని మొత్తం 12 మంది కరోనా భారిన పడ్డారు. ఆగస్టు 6 వ తేదీన ఆమె భర్త ఎమ్మెల్యేలే రవికి కరోనా సోకింది. అతని ద్వారా నవనీత్ కౌర్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయం సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ తెలిపారు.

కరోనా నిర్ధారణ అవ్వగానే నవనీత్ కౌర్ కూడా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఇప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించినట్టుగా తెలుస్తోంది. ఆమె తన కుటుంబ సభ్యులు ముంబైలోని అమరావతి ఆసుపత్రిలో కరోనాకు చికిత్స తీసుకున్తున్నారు. వీరిలో ఆమె అత్తా, మామ, పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను వెంటనే నాగ్ పూర్ లోని మరో ఆసుపత్రికి తరలించారు.

భాషల్లో నటించిన నవనీత్ కౌర్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో బీజేపీ త‌రుపున అమ‌రావ‌తి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత న‌వనీత్ కౌర్ అదే స్థానం నుంచి స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి విజ‌యం సాధించారు.

Related News