logo

  BREAKING NEWS

ముఖ్య‌మంత్రినీ వ‌ద‌ల‌ని క‌రోనా..! పాజిటీవ్ వ‌చ్చింద‌ని ట్వీట్‌

క‌రోనా మ‌హ‌మ్మారి ప‌డ‌గ విప్పుతోంది. ఏకంగా ఒక ముఖ్య‌మంత్రి క‌రోనా బారిన ప‌డ్డారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు క‌రోనా పాజిటీవ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా వెల్లడించారు. త‌న‌కు క‌రోనా పాజిటీవ్ వ‌చ్చింద‌ని, త‌న‌ను క‌లిసిన వారు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు. క‌రోనా పాజిటీవ్ రావ‌డంతో శివ‌రాజ్ సింగ్ చౌహాన్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

తాను అన్ని కోవిడ్ గైడ్‌లైన్స్ పాటిస్తున్నాన‌ని, డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు సెల్ప్ క్వారంటైన్‌లోకి వెళ్లిన‌ట్లు శివ‌రాజ్ సింగ్ చెప్పారు. కానీ, త‌న విధుల‌ను కొన‌సాగిస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ప్ర‌తి రోజు క‌రోనా రివ్యూలో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా పాల్గొంటాన‌ని తెలిపారు. దేశంలో క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన మొద‌టి ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్. ఇప్ప‌టికే వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు క‌రోనా బారిన ప‌డ్డారు.

Related News