logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

అయోధ్య భూమిపూజకు ఎంఐఎం అధినేత.. 

హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ చేస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 5న జరగనున్న అయోధ్య భూమి పూజకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ప్రధాని చేతుల మీదుగా ఈ ఆలయ నిర్మాణానికి పునాది రాయి పడనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని అయోధ్య పర్యటనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి ఓ వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఒవైసీ మండిపడ్డారు. కాగా తాజాగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఆ పార్టీ సీనియర్ నేత కృష్ణ సాగర్ రావు అయోధ్య భూమి పూజకు అసదుద్దీన్ ను ఆహ్వానించారు. అయోధ్య భూమి పూజలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ పరిణామం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసదుద్దీన్ వ్యాఖ్యలపై కూడా అయన స్పందించారు. ఒవైసీ గాని ప్రతి పక్షాలు గాని దీనిపై లేవనెత్తిన అభ్యంతరాలు చాలా అల్పమైనవిగా పేర్కొన్నారు. వాటిపై స్పందించాల్సిన అవసరం కూడా లేదన్నారు. తన మతాన్ని ఆచరించే హక్కు, స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఉంటుంది. అందులో దేశ ప్రధాని అయిన మోదీకి ఆ అధికారం ఎక్కువ ఉంటుంది అని వ్యాఖ్యానించారు. ఒవైసీ తో పాటుగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రతి ఒక్క కమ్యూనిస్టు నేతను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము అని కృష్ణదాస్ తెలిపారు.

Related News