logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

మూవీ రివ్యూ: ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ , గోపరాజు రమణ, చైతన్య, దివ్య శ్రీపాద
దర్శకత్వం: వినోద్ అనంతోజు
రచయిత: జనార్దన్ పసుమర్తి
సంగీతం: స్వీకార్ అగస్తి
నిర్మాత: ఆనంద్ ప్రసాద్

ఎలాంటి హడావిడి లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుని ఓటీటీలో విడుదలైన సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’. విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ , ‘జాను’ ఫేమ్ వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రోమోలతోనే ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీని కలిగించారు సినిమా టీమ్. ఇటీవల విడుదలైన గుంటూరు నేపథ్యంలో సాగే పాట ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 20న మిడిల్ క్లాస్ మెలోడీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా విశేషాలేంటో చూసేద్దాం..

కథ:
టైటిల్ లో చెప్పినట్టుగానే ఈ సినిమా మధ్యతరగతి కుటుంబాల చుట్టూ తిరిగే కథ. గుంటూరు దగ్గర ఓ చిన్న పల్లెటూరిలో కాఫీ హోటల్ నడుకునే కొండల్ రావు (గోపరాజు రమణ) కొడుకు రాఘవ (ఆనంద్ దేవరకొండ). బొంబాయి చట్నీ బాగా చేస్తాడు. తన చట్నీ రుచిని గుంటూరు వారికి చూపించాలని అక్కడే సొంత హోటల్ పెట్టి సక్సెస్ కావాలని కళలు కంటాడు. కానీ అందుకు రాఘవ తండ్రి ఒప్పుకోడు. రాఘవ తన మరదలు సంధ్యను ప్రేమిస్తాడు. ఆమెకు కూడా రాఘవను ప్రేమిస్తుంది.

కానీ ఆమె తండ్రి తనకు వేరే సంబంధాలు చూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో అనేక అడ్డంకుల్ని దాటుకుని తాను అనుకున్నట్టే గుంటూరులో హోటల్ పెడతాడు రాఘవ. అయితే ఎంత ప్రయత్నించినా తన హోటల్ నడవకపోవడం మరోవైపు ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోలేకపోతాననే వేదనకు గురవుతాడు. చివరకు రాఘవ తాను అనుకున్నది ఎలా సాధిస్తాడు? తన మరదలిని పెళ్లిచేసుకోగలిగాడా? అనే విషయాలు సినిమాలో చూడాల్సిందే.

విశ్లేషణ:
సాధారణంగా మధ్యతరగతి నేపథ్యంలో ఏదైనా సినిమా వస్తుందంటే అందులో కచ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంటుంది. ఇప్పటివరకు ఇలాంటి కోణంలో రాసుకున్న సినిమాలన్నీ ఆలా వచ్చి సక్సెస్ అయినవే. ఇప్పుడు మళ్ళీ అదే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. ఆనంద్ దేవరకొండకు ఇది రెండో సినిమా. తాను ఎంచుకున్న ఈ కథలో కొత్తదనం లేదు. అందరికీ తెలిసిన కథే. నటీనటులు కూడా అందరూ కొత్తవారే. అయినా ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

సినిమాను సహజత్వానికి దగ్గరగా చూపిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర అందులో నటించిన వారితో సహా గుర్తుండిపోతుంది. ముఖ్యంగా హీరో తండ్రి పాత్రలో నటించిన గోపరాజు రమణ అద్భుతంగా నటించారు. ఆయన తెరపై కనిపించే ప్రతి సన్నివేశం ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వదు. ఆనంద్ దేవరకొండ గుంటూరు యాసలో పరవాలేదనిపించాడు. మొదటి సినిమాతో పోలిస్తే మధ్య తరగతి యువకుడిగా ఈ సినిమాలో మంచి మార్కులే కొట్టేసాడు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ అందం, క్యూట్ లుక్స్ తో అదరగొట్టింది.

ఇక కథలోకి వస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా సాగిపోతుంది. జాతకాలను నమ్మి ప్రేమించిన అమ్మాయిని వదులుకునే రాఘవ స్నేహితుడి కథను కూడా ఆసక్తికరంగా చూపించారు. అయితే ఆ కథతో పోలిస్తే హీరోహీరోయిన్ల మెయిన్ లవ్ స్టోరీ సాదా సీదాగా సాగిపోవడం నిరాశపరుస్తుంది. ఈ సినిమాలోని సన్నివేశాలు, పాత్రలు గుంటూరు ప్రేక్షకులకు తెగ నచ్చేస్తాయి. ముఖ్యంగా ప్రతి వంటకం రుచి చెబుతూ సాగే ‘గుంటూరే..’ పాట చాలా బాగుంది. ఓ సాధారణ యువకుడు సిటీకి వెళ్లి హోటల్ పెట్టాలనుకోవడం అందుకోసం అతనికి ఎదురయ్యే కష్టాలు అన్నీ చాలా సహజంగా తెరకెక్కించాడు దర్శకుడు.

సినిమాకు మాటలు రాసిన రచయిత జనార్దన్ పసుమర్తిని అభినందించి తీరుతారు. మధ్యతరగతి ప్రజలు మాట్లాడుకునే బాష, ముఖ్యంగా గుంటూరు యాసను చక్కగా రాసుకొచ్చారు. స్వీకార్ అగస్తి సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి. సినిమాలో ట్విస్టులు, మలుపులు ఏమీ కనిపించవు. అలాగని చూసేవాళ్లకు బోర్ కొట్టదు. 2 గంటల సేపు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. దర్శకుడు క్లైమాక్స్ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టుంటే సినిమా మరో స్థాయిని అందుకునేదని చెప్పొచ్చు.

సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే.. సినిమా కథ, గుంటూరు నేపథ్యం, సహజమైన పాత్రలు, కామెడీ మిడిల్ క్లాస్ మెలొడీకి ప్రధాన బలాలుగా చెప్పొచ్చు. తెలిసిన కథే కావడం ఈ సినిమాకు మైనస్ పాయింట్ గా నిలిచింది.

మొత్తంగా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ కు 3/5 రేటింగ్ ఇవ్వచ్చు.

Related News