logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

జ‌గ‌న్‌కు గుడ్ న్యూస్ చెప్పి కేసీఆర్‌కు షాక్ ఇచ్చిన స‌ర్వే

దేశంలోని ముఖ్య‌మంత్రుల్లో బెస్ట్ సీఎంగా ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆధిత్య‌నాథ్ నిలిచారు. ఇండియా టుడే – కార్వీ ఇన్‌సైట్స్ అనే సంస్థ‌లు మూడ్ ఆఫ్ ధి నేష‌న్ పేరుతో ఓ స‌ర్వే నిర్వ‌హించాయి. జులై 15వ తేదీ నుంచి 27 వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా ఈ స‌ర్వే జ‌రిగింది. ప్ర‌స్తుత రాజకీయ ప‌రిస్థితులు, ఇత‌ర అంశాల‌పై దేశ ప్ర‌జ‌ల అభిప్రాయాలు తెలుసుకోవ‌డం ఈ స‌ర్వే ఉద్దేశ్యం. ఉత్త‌మ ముఖ్య‌మంత్రిగా మీ ఓటు ఎవ‌రికి వేస్తారు అనే ప్ర‌శ్న‌కు 24 శాతం మంది యోగి ఆధిత్య‌నాథ్ పేరు చెప్పారు. దీంతో ఆయ‌న దేశంలోనే బెస్ట్ సీఎంగా నిలిచారు.

ఈ లిస్టులో ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ 15 పాయింట్ల‌తో రెండ‌వ స్థానంలో ఉన్నారు. ఆయ‌న త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 11 పాయింట్ల‌తో మూడో స్థానాన్ని ద‌క్కించుకున్నారు. ఇంత‌కుముందు చేసిన స‌ర్వేలో జ‌గ‌న్‌కు నాలుగో స్థానం ద‌క్క‌గా ఇప్పుడు ఒక స్థానాన్ని పెంచుకున్నారు. ఈ లిస్టులో నాలుగో స్థానంలో ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, ఐదో స్థానంలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ఉన్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ 3 పాయింట్ల‌తో తొమ్మిదో స్థానంలో నిలిచారు.

ఇక ప్ర‌ధాన మంత్రిగా న‌రేంద్ర మోడీ ప‌నితీరు ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సానుకూల‌త ఉంది. ఈ స‌ర్వే ప్ర‌కారం ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే లోక్‌స‌భ స్థానాల్లో బీజేపీ 283 గెలుచుకొని అధికారంలోకి వ‌స్తుంది. కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 49 స్థానాల‌కే ప‌రిమితం కానుండ‌గా, ఇత‌రుల‌కు 211 స్థానాలు వ‌స్తాయ‌ని అంచ‌నా. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌నితీరు అద్భుతంగా ఉంద‌ని 30 శాతం మంది, బాగుంద‌ని 48 శాతం మంది, ప‌ర్వాలేద‌ని 17 శాతం మంది, బాగాలేద‌ని 5 శాతం మంది అభిప్రాయ‌ప‌డ్డ‌ట్లు ఈ స‌ర్వే చెబుతోంది.

మోడీ ప్ర‌భుత్వం చేసిన మంచి ప‌ని ఏంటి అని అడిగిన ప్ర‌శ్న‌కు 16 శాతం మంది జ‌మ్మూ క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేయ‌డం అని చెప్పారు. 13 శాతం మంది అయోధ్య రామ్ మందిర్ అని, 9 శాతం మంది అవినీతి నిర్మూల‌న జ‌రిగింద‌ని, 7 శాతం మంది క‌రోనాను బాగా ఎదుర్కోవ‌డం మోడీ ప్ర‌భుత్వ విజ‌యాలుగా చెప్పారు. కానీ, 25 శాతం మంది క‌రోనాను ఎదుర్కోవ‌డంలో మోడీ ప్రభుత్వం విఫ‌ల‌మైంద‌ని చెప్పారు. 23 శాతం మంది దేశంలో నిరుద్యోగం పెరగ‌డం మోడీ ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మ‌ని చెప్పారు.

ఇప్పటికిప్పుడు దేశానికి అతిపెద్ద స‌మ‌స్య ఏంటి అని అడ‌గ‌గా.. 70 శాతం మంది క‌రోనా అని, 12 శాతం మంది నిరుద్యోగం అని చెప్పారు. చైనాతో వివాదం మ‌న అతిపెద్ద స‌మ‌స్య అని కేవ‌లం 1 శాతం మంది మాత్ర‌మే చెప్పారు. మోడీ ప్ర‌భుత్వంలో బాగా ప‌ని చేస్తున్న మంత్రులు ఎవ‌రూ అనే ప్ర‌శ్న‌కు 39 శాతం మంది హోం మంత్రి అమిత్ షా పేరు చేప్పారు. ఆయ‌న త‌ర్వాత స్థానాల్లో రాజ్‌నాథ్ సింగ్‌, నితిన్ గ‌డ్క‌రి, నిర్మ‌లా సీతారామ‌న్ ఉన్నారు.

Related News