logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు

అనుకున్న సమయానికన్నా ముందుగానే నైరుతి రుతుపవనాల రాకతో మరో రెండు మూడు పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖా హెచ్చరించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నాగరత్నం మాట్లాడుతూ… రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

కొమరం భీం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, రూరల్, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలపై రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. అటు కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే బెంగాల్, ఛత్తీస్ ఘర్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం లో నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయన్నారు. తీర ప్రాంతం వర్షాల కారణంగా అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్య కారులెవరు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Related News