అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘సుడిగాడు’ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమైన గుజరాతి బ్యూటీ మోనాల్ గజ్జర్. టాలీవుడ్ లో అంతగా అవకాశాలు రాకపోవడంతో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మోనాల్ కు అదృష్టం తలుపు తట్టింది. ఇప్పుడు ఆమె లక్కు చూసిన వారంతా ఇదే అంటున్నారు.
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన మోనాల్ ఆ తర్వాత అఖిల్, అభిజిత్ లతో చేసిన సందడికి ఆమెకు భారీగా అభిమానులు పెరిగిపోయారు. వీరి మధ్య రిలేషన్ ఇప్పటికీ క్లారిటీ లేకపోయినా ఈ ట్రయాంగిల్ స్టోరీ బిగ్ బాస్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. అయితే ఆ తర్వాత ఆమెకు హౌస్ లో అనుకూలమైన పరిస్థితితులు లేకుండా పోయాయి.
దీంతో ఆమె స్ట్రాంగ్ ప్లేయర్ గా మారి తన సత్తా చాటింది. హరికకు కెప్టెన్సీ టాస్క్ లో హెల్ప్ చేసి మంచి మార్కులే కొట్టేసింది. అయితే అంతా అనుకున్నట్టుగానే ఆమె ఫైనల్ రేసులో నిలవలేకపోయింది. 14 వారంలో మోనాల్ ఎలిమినేటి అయ్యి బయటకు వచ్చింది. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ పై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతారు.
హౌస్ లో అందరికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది లాస్య అని టాక్ వినిపిస్తున్న విషయం తెలిసందే. అయితే మోనాల్ కూడా తక్కువేం కాదట. ఆమె పారితోషకం కూడా లక్షల్లోనే ఉంది. మోనాల్ వారానికి రూ. 2 లక్షలు తీసుకుందని ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు మొత్తం వారాలకు గాను రూ. 30 లక్షలు అందాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ వార్తలో నిజమెంతో తెలియదు గాని మోనాల్ రెమ్యునరేషన్ గురించి తెలిసినవారు మాత్రం నోరెళ్లబెడుతున్నారు.