logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

షాకిచ్చిన మోనాల్.. తోటి కంటెస్టెంట్ ఫ్యాన్స్ పై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు!

బిగ్ బాస్ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలేకు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది.ఈ నేపథ్యంలో ఇటీవల హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తన తోటి కంటెస్టెంట్ అయిన అభిజిత్ అభిమానులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హౌస్ లో ఉన్న సమయంలో తనపై ఇష్టం వచ్చిన విధంగా ట్రోలింగ్ చేయడంపై ఫిర్యాదు చేసినట్టుగా వెల్లడించింది.

ఒక రోజు తాను డీప్ నేక్ డ్రెస్ వేసుకుని కుర్చున్నానని తనను ట్రోల్ చేసారని తెలిపింది. అయితే ఆ రోజు తన ఆరోగ్యం బాగాలేదని కనీసం షాంపూ కూడా చేసుకోకుండా తలకు నూనెతో అలాగే ఉన్నానని అసలు ఓపిక లేకుండా ఉన్నానని వివరించింది. దానిని కూడా ట్రోల్ చేయడం పై ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా మోనాల్ సోదరి హేమాలిని కూడా నెటిజన్లు తప్పుపట్టారు.

హేమాలి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన సమయంలో మోనాల్ తో ఏదైనా సమస్య ఉంటె తనతో నేరుగా చెప్పు వెనక మాట్లాడవద్దని హేమాలి అభిజిత్ కి చెప్పింది. దీంతో అభిజిత్ ఫ్యాన్స్ వెంటనే మోనాల్ సోదరిని కూడా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఆమెను చంపుతామని బెదిరించడంతో తన సోదరి బాధపడినట్టుగా మోనాల్ చెప్పుకొచ్చింది. ఆమె కొంచెం స్ట్రాంగ్ గా ఉండవచ్చు. కానీ చెప్పిన దాంట్లో తప్పేమి లేదని తెలిపింది. అందుకే అభిజిత్ ఫ్యాన్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దమైనటుగా తెలిపింది.

Related News