ఆస్ట్రేలియా టూర్ ముగించుకు వచ్చిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ చేరుకున్నాడు. విమానాశ్రయంలో దిగగానే అక్కడి నుంచి నేరుగా తన తండ్రి సమాధి దగ్గరకు వెళ్లి ప్రార్థనలు చేసాడు. అక్కడ తన తండ్రికి నివాళులు అర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్తించాడు.
స్ట్రేలియా ఆతరఫున ఎంపికైన జట్టులో మహ్మద్ సిరాజ్ తొలి స్థానం సంపాదించాడు. టీమిండియా తరపున ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన కొన్ని రోజులకే అతని తండ్రి అనారోగ్యంతో మరణించాడు. ఆ సమయంలో సిరాజ్ తిరిగి ఇండియాకు వచ్చేస్తాడని, తండ్రి అంత్యక్రియలు పూర్తైన తర్వాత తిరిగి ఆటలో చేరతాడని అంతా భావించారు.
కానీ టీమిండియా తరపున ఆడాలని తన తండ్రి ఎన్నో కళలు కన్నాడని వాటిని నిజం చేసిన తర్వాతనే స్వదేశానికి తిరిగి రావాలని సిరాజ్ తల్లి చెప్పడంతో అతను తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదు. కాగా మహ్మద్ సిరాజ్ తండ్రి ఆటో డ్రైవర్ గా పని చేసేవారు. కొడుకుని భారత్ జట్టులో చూడాలని ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.