logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కరోనా కట్టడికి ‘ధన్వంతరీ రథ్’ అమలు చేయండి: ప్రధాని

కరోనాపై పోరుకు గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన ‘ధన్వంతరీ రథ్’ కార్యక్రమాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కరోనా వ్యాప్తి కట్టడికి అహ్మదాబాద్లో విజయవంతమైన ఈ కార్యక్రమాన్ని అంతటా అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. అయితే ప్రధాని స్వయంగా ఈ కార్యక్రమాన్ని అభినందించడంతో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఈ చిన్న కార్యక్రమం వెలుగులోకి వచ్చింది. ప్రధాని పిలుపుతో ధన్వంతరీ రథ్ ను ఆయా రాష్ట్రాలు కూడా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం ఎలా పనిచేస్తుంది? కరోనా కట్టడికి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.

గతంలో ప్రభుత్వాసుపత్రుల్లో వేల సంఖ్యలో అవుట్ పేషంట్లు వచ్చి చేరేవారు. కానీ కరోనా దెబ్బకు ఆసుపత్రులలో రోగుల రాక తగ్గిపోయింది. ఇది బయటకు కనిపించే విషయం. నిజానికి కరోనా మహమ్మారి కారణంగా పెద్దాసుపత్రులన్నీ కోవిడ్ ఆసుపత్రులుగా మరాయి. దీంతో ఉన్న రోగాలకు తోడు కొత్త రోగాలు వచ్చి చేరుతాయనే భయంతో సాధారణ ప్రజలు ఇటువైపు తొంగి చూసే సాహసం చేయడం లేదు. ఊహించని ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి గుజరాత్ లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

కరోనా భయంతో ఆసుపత్రులకు రాలేని వారికి ఇంటి వద్దనే వైద్యం అందించాలని సంకల్పించింది. అందుకోసం సకల వైద్య సదుపాయాలతో ధన్వంతరీ రథ్ ను రంగంలోకి దించింది. ఈ వాహనాలు అహ్మదాబాద్ లోని ఇంటింటికి వెళ్లి అనారోగ్యంతో బాధపడే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో వాహనంలో డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్, ఫార్మాసిస్టులు ఉంటారు. థర్మల్ గన్‌తో శరీర ఉష్ణోగ్రత చెక్ చేస్తారు. అనంతరం సదరు వ్యక్తికి మధుమేహం, బీపీ పరీక్షించి తదితర సమాచారాన్నంతా నమోదు చేసుకుంటారు. అనారోగ్యంతో ఉంటె వారికి అక్కడికక్కడే వైద్యం అందిస్తారు. నగరవ్యాప్తంగా ఇప్పటివరకు 120 వాహనాలను అందుబాటులో ఉంచారు.

మొదటి విడతలోనే 4 లక్షల మందికి ఓపీ సేవలను అందించగలిగారు. అయితే ధన్వంతరీ రథ్ కార్యక్రమం ద్వారా ఊహించని విధంగా కరోనా కేసులను కూడా అదుపు చేయగలిగారు అధికారులు. నగర ప్రజలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూనే వీరికి ఆక్సిజన్ స్థాయి, శరీర ఉష్ణోగ్రతలు, ఇతర కోవిడ్ లక్షణాలను కూడా పరీక్షించేవారు. ఈ సమయంలోనే అప్పటివరకు బయటపడని కరోనా కేసులు వెలుగుచూశాయి.

సరైన సమయంలో వారికి అవసరమైన వైద్య సేవలు అందించి కరోనాను విజయవంతంగా కట్టడి చేయగలిగారు. విపత్తు సమయంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వైద్యం అందించాలనే ఆలోచన చేసిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై ప్రధాని ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభత్వం కూడా ప్రవేశపెడితే బాగుంటుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

Related News