logo

4.4 కోట్ల రేషన్ కార్డుల రద్దు.. కేంద్రం సంచలన నిర్ణయం!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు అందాలన్నా, నెలవారీ రేషన్ పొందాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి. అయితే ఈ రేషన్ కార్డులలో అక్రమార్కుల కన్ను పడింది. అందుకే ఈ ప్రక్రియలో అక్రమాలను తొలగించేందుకు ఆధార్ తో రేషన్ కార్డులను అనుసంధానం చేసుకోవడం కేంద్రం తప్పనిసరి చేసింది.

కాగా ఇప్పటికీ ఆధార్ కార్డుతో అనుసంధానం చేయని 4.4 కోట్ల అక్రమ రేషన్ కార్డులను రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. నకిలీ రేషన్ కార్డుల వల్ల లబ్దిదారులైన అర్హులకు నష్టం వాటిల్లుతుంది. దీంతో కేంద్రానికి ఏటా వేల కోట్ల నష్టం కలుగుతుంది. ఈ అంశం పై ఆహార మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. 2013 సంవత్సరానికి ముందు చాలా బోగస్ కార్డులు ఉండేవి. గత ఏడేళ్ల కాలంలో వాటన్నిటినీ తొలగించడం జరిగింది.

అదేవిధంగా మరణించిన వారి కార్డులకును కూడా తొలగించామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా రేషన్ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఇకపై నకిలీ ధ్రువపత్రాలతో తీసుకున్న కార్డులు, ఆధార్ కార్డుతో అనుసంధానం కాని రేషన్ కార్డులు పనిచేయవని స్పష్టం చేసారు.

Related News