logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. రైతులకు శుభవార్త!

లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్థిక రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రు వర్గ సమావేశంలో కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్టుగా మంత్రులు ప్రకాష్ జవదేకర్, నితిన్ గడ్కరీ, నరేంద్ర తోమర్ వెల్లడించారు.

ముఖ్యంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. 2020-21 సంవత్సరానికి గాను వివిధ పంటలకు సంబందించిన కనీస మద్దతు ధరను పెంచుతున్నట్టుగా నిర్ణయించామని మంత్రులు మీడియాకు వివరించారు. వారి పంటకు కనీస మద్దతు ధరను క్వింటాల్ కు రూ. 53కు పెంచామని దీంతో క్వింటాల్ వారి ధర రూ. 1,868 కు చేరుతుందన్నారు. అదేవిధంగా క్వింటాల్ పత్తి ధర రూ. 260 కు పెంచనున్నట్టుగా పేర్కొన్నారు. ఇప్పుడు క్వింటాల్ పత్తి ధర రూ. 5, 515 కు చేరుకుందన్నారు.

జోవార్ మద్దతు ధర క్వింటాల్‌కు రూ .2,620, బజ్రా-రూ.2150, రాగి, మూంగ్, వేరుశనగ, సోయాబీన్, టిల్ మరియు కాటన్లలో 50 శాతం పెరగనున్నట్టు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఎస్ఎమ్ఈలది కీలక పాత్ర అని పేర్కొన్నారు. వాటి అభివృద్ధికి కేంద్రం రూ. 50 వేల కోట్లను కేటాయించిందన్నారు. వీధి వ్యాపారులను ఆదుకునేందుకు తక్షణమే వారికి రూ. 10 వేల రూపాయల రుణాలు అందించాలని కేంద్రం నిర్ణయించినట్టుగా మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.

Related News