తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తమను గెలిపిస్తే పాత బస్తీలో సర్జికల్ స్ట్రిక్స్ నిర్వహిస్తామంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. కొన్ని ఓట్ల కోసం, సీట్ల కోసం సంజయ్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. సంజయ్ వ్యాఖ్యలను హోమ్ శాఖా మంత్రి కిషన్ రెడ్డి సమర్థిస్తారా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో హైదరాబాద్ లో రోహింగ్యాలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో మేయర్ పీఠం గెలిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామన్నారు. రోహింగ్యాలు, పాకిస్థానీలను తరిమి తరిమికొడతామన్నారు. వారి ఓట్లు లేని ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.