logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉంది.. మహిళా ఎమ్మెల్యే ఫిర్యాదు!

తనకు ఇద్దరు వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేసారు. శృంగపాటి సందీప్, చలివేంద్రపు సురేష్ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉందని తనపై కొన్ని రోజులుగా బెదిరింపులకు దిగుతున్నారని నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసారు.

సందీప్, సురేష్ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు. అక్రమంగా మద్యం సరఫరా, పేకాట ఆడిస్తూ గతంలో పోలీసులకు చిక్కారు. దీంతో మండల నాయకులు వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ ఇద్దరు వ్యక్తులపై తానే అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టుగా భావించి వారు తనను వేధిస్తున్నట్టుగా శ్రీదేవి పేర్కొన్నారు.

తన గొంతును మార్ఫింగ్ చేసి మాట్లాడుతూ తనను అవమానిస్తున్నారని, బయటకు వెళ్ళినప్పుడు తనను వెంబడిస్తున్నారని వారి నుంచి తనను రక్షించాలని ఫిర్యాదులో కోరారు. ఎమ్మెల్యే శ్రీదేవి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News